కరోనా సెకండ్ వేవ్ లో 2, 3 రోజులకే తీవ్రత పెరుగుతోంది : మంత్రి ఈటల

Centre Must Take Responsibility for Vaccine Shortages, Centre to Address Covid Vaccine Shortage Issue, Coronavirus Pandemic, Health Minister Etala Rajender, Mango News, Minister Etala Rajender, Minister Etala Rajender Asks Centre to Address Covid Vaccine Shortage, Minister Etala Rajender Asks Centre to Address Covid Vaccine Shortage Issue Immediately, Telangana Coronavirus, Telangana Coronavirus News, Telangana Health Minister Etala Rajender, Telangana Health Minister Etala Rajender about Corona Situation in the State, Telangana Minister Etala Rajender, vaccine Utsav

కొవిడ్ వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రోజుకు 10లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ, టీకాలు అందుబాటులో లేక ఆదివారం నాడు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆదివారం రాత్రికి 2.7 లక్షలు డోసులు తేప్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ సమస్యను త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై బిఆర్కేఆర్ భవన్ లో ఆదివారం నాడు మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

కరోనా సెకండ్ వేవ్ లో 2 లేదా 3 రోజులకే తీవ్రత పెరుగుతోంది :

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 25ఏళ్లు పైబడిన వారికి కూడా కొవిడ్ టీకా ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు స్పందించలేదన్నారు. దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 50శాతం మహారాష్ట్ర నుంచే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడక కొరత లేదని, రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొవిడ్ చికిత్సకు ఐసీఎంఆర్ స్పష్టమైన ప్రొటోకాల్ ఇచ్చింది. గతంలో 10,12 రోజులకు లక్షణాలు కనిపించేవి. కానీ సెకండ్ వేవ్ లో 2 లేదా 3 రోజులకే తీవ్రత పెరుగుతోందని అన్నారు.

ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు:

అలాగే రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరతలేదని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా వైద్యశాఖ అధికారులు నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం. ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ఉత్పత్తి చేసుకోలేవు. ప్రస్తుతం రోజుకు 260 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ 300 నుంచి 350 టన్నుల వరకు అవసరమయ్యే ఆస్కారముంది. పేషెంట్ ఆందోళనను బట్టి ట్రీట్మెంట్ కాకుండా, అవసరాన్ని బట్టి వైద్యం అందించాలని వైద్యులను కోరుతున్నా. అవసరం లేకపోయినా ఆక్సిజన్ పెట్టాలని వైద్యులపై ఒత్తిడి చేయడం సమంజసం కాదు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అనవసరంగా అందరికీ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వొద్దు. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత రెమ్డెసివిర్ ఉత్పత్తి తగ్గిపోయింది. త్వరలోనే కావాల్సినన్ని రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =