ఏప్రిల్ 1న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం, విద్యార్థులతో సంభాషించనున్న ప్రధాని మోదీ

PM Modi will Interact with Students in a Programme Pariksha Pe Charcha Scheduled on April 1, PM Modi will Interact with Students in a Programme Pariksha Pe Charcha, PM Modi will Interact with Students, Pariksha Pe Charcha, Pariksha Pe Charcha Programme, Pariksha Pe Charcha Programme Latest News, Pariksha Pe Charcha Programme Latest Updates, Pariksha Pe Charcha Programme Live Updates, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, Students, Pariksha Pe Charcha Programme Scheduled on April 1, Mango News, Mango News Telugu,

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం ఏప్రిల్ 1, 2022న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో సంభాషించనున్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షల రాసే అంశంపై ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.

శనివారం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఒత్తిడి లేని పరీక్షల గురించి మరోసారి మాట్లాడుకుందాం. చైతన్యవంతమైన విద్యార్థులు/ఎక్జామ్ వారియర్స్, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఏప్రిల్ 1వ తేదీన ఈ సంవత్సరం పరీక్షా పే చర్చలో చేరాలని కోరుతున్నాను. పరీక్షా పే చర్చా కార్యక్రమం ఇంటరాక్టివ్ గా, తేలికగా ఉంటుంది. పరీక్షలు, చదువులు, జీవితం మరియు మరిన్నింటికి సంబంధించిన వివిధ అంశాల గురించి మాట్లాడే అవకాశాన్ని మనందరికీ అందిస్తుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు పరీక్షా పే చర్చ కార్యక్రమంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, ప్రతి యువకుడు ఎదురు చూస్తున్న ఇంటరాక్షన్ సెషన్ ఏప్రిల్ 1, 2022న జరగబోతోంది. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడి, భయము మరియు ఇతర సమస్యలను అధిగమించడానికి ప్రధాని మోదీ నుంచి సలహాలను కోరండి, అనుకూల చిట్కాలను నేర్చుకోండని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =