మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన: ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీల ప్రతినిధులతో స‌మావేశం, పెట్టుబడులకు ఆహ్వానం

Minister KTR Meets Top Leadership of Worlds Largest Pharma Companies in USA Tour, Minister KTR Meets Top Leadership of Worlds Largest Pharma Companies, Worlds Largest Pharma Companies, Pharma Companies, Top Leadership of Worlds Largest Pharma Companies, Minister KTR USA Tour, Minister KTR America Tour, KTR America Tour, Telangana Minister KTR On 10 Day Trip To USA, Telangana Minister KTR Will Seek Investment For Telangana, Telangana Minister, Minister KTR 10 Days Tour, America Tour, KTR 10 Days Tour, Telangana Minister KTR, KTR, Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు అనేక కీలక సమావేశాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్ర‌పంచంలో అతి పెద్ద ఫార్మా కంపెనీలైన‌ ఫైజ‌ర్‌, జాన్స‌న్ అండ్ జాన్స‌న్ (జేఅండ్‌జే), జీఎస్‌కే అధిప‌తుల‌తో శ‌నివారం ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. ఫైజ‌ర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ఉవే స్కోన్‌బెక్‌తో స‌మావేశ‌మ‌య్యారు. అయితే దీనికి ముందుగా ఫైజ‌ర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్, చైర్మ‌న్ డాక్ట‌ర్ ఆల్బ‌ర్ట్ బౌర్లా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ గ్లోబ‌ల్ స‌ప్లై ఆఫీస‌ర్ మైక్ మెక్‌డెర్మాట్‌తో కీలక చ‌ర్చ‌లు జ‌రిపారు. ఫైజ‌ర్ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఎక్సపాన్షన్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి కేటీఆర్ ప్రతిపాదన చేశారు.

అనంత‌రం జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ మ‌థాయ్ మామెన్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ‌లో లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సిస్టం ఏర్పాటులో వారి భాగస్వామ్యాన్ని కోరుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత మ‌రో ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) చీఫ్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ ఆగం ఉపాధ్యాయ్‌ని కలుసుకున్నారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలను, అందివ్వనున్న ప్రోత్సాహాన్ని వారికి వివరించి చెప్పారు. అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఏషియా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆయా కంపెనీల ప్రతినిధులను కోరారు. ఈ స‌మావేశాల్లో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ శక్తి ఎం. నాగప్పన్ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + nine =