సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన, కునో నేషనల్ పార్క్‌లో అడవి చిరుతల విడుదల

PM Modi will Visit Madhya Pradesh on 17th September will Release Cheetahs in Kuno National Park, PM Modi Madhya Pradesh Tour, Release Cheetahs in Kuno National Park, PM Modi Will Visit Madhya Pradesh , PM Narendra Modi, Mango News, Mango News Telugu, Narendra Modi, PM Narendra Modi MP Tour, Madhya Pradesh Tour, PM Narendra Modi Latest News And Updates, Pm Modi Twitter Updates, Prime Minister Of India

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17, శనివారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం 10:45 గంటలకు ప్రధాని మోదీ కునో నేషనల్ పార్క్‌లో అడవి చిరుతలను విడుదల చేస్తారు. కునో నేషనల్ పార్క్‌లో అడవి చిరుతలను విడుదల చేయడం భారతదేశ వన్యప్రాణులను మరియు దాని నివాసాలను పునరుజ్జీవింపజేయడానికి, వైవిధ్యపరచడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమని పేర్కొన్నారు. చిరుతలు 1952లో భారతదేశం నుండి అంతరించిపోయినట్లు ప్రకటించారని తెలిపారు. ఇక విడుదల చేయబోయే చిరుతలు నమీబియాకు చెందినవని, ఈ సంవత్సరం ప్రారంభంలో సంతకం చేసిన ఏంఓయూ క్రింద తీసుకురాబడ్డాయన్నారు. భారతదేశంలో చిరుతలను ప్రవేశపెట్టడం ప్రాజెక్ట్ చిరుత కింద చేయబడుతుందని, ఇది ప్రపంచంలోనే మొదటి అంతర్-ఖండాంతర అడవి జంతువుల బదిలీ ప్రాజెక్ట్ అని చెప్పారు. చిరుతలు దేశంలో బహిరంగ ఆడవి మరియు గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొన్నారు.

అనంతరం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు షియోపూర్‌లోని కరాహల్‌లో మహిళా స్వయం సహాయక బృందం సభ్యులు/కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లతో కలిసి ప్రధాని మోదీ ఎస్ హెఛ్ జీ సమ్మేళన్‌లో పాల్గొననున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానమంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న కింద నాలుగు ప్ర‌త్యేకంగా వ‌ల్న‌ర‌బుల్ ట్రైబ‌ల్ గ్రూప్స్ (పివిటిజి) నైపుణ్య కేంద్రాల‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించ‌నున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − six =