ఏపీలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష – అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చలో సీఎం జగన్

AP Assembly Session CM YS Jagan Speech During Debate on Three Capitals Issue, AP Assembly Session CM YS Jagan Speech , Andhra Pradesh Legislative Assembly, Winter Session,AP Assembly Mansoon Session, Mango News, Mango News Telugu, AP Assembly Sessions, Monsoon session of Andhra Pradesh Legislature, AP Assembly Calendar , Monsoon Session of AP Legislature, Andhra Pradesh Legislative Assembly Sep15th, Monsoon Session, AP Assembly Session Latest News And Updates, YSR Congerss Paty, TDP Party, BJP Party, Janasena Party

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష అని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతంలోనే జరిగితే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారని, అసలు అభివృద్ధి చేయలేని రాజధాని కోసం ఉద్యమాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అయితే సీఎం ప్రసంగం ప్రారంభమవ్వకముందు స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

  • అమరావతిపై నాకు ఎలాంటి కోపం లేదు.. ఎందుకు కోపం ఉండాలి? ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష.
  • అమరావతి అటు గుంటూరుకు, ఇటు విజయవాడకు దూరంగా ఉంది. ఆ ప్రాంతంలో కనీస వసతి సౌకర్యాలు లేవు.
  • చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. బినామీల పేరుతో అమరావతి భూములను లాగేసుకున్నారు.
  • అమరావతి నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్లు కావాలని, ఇక్కడ అభివృద్ధికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అప్పట్లోనే చంద్రబాబు చెప్పారు.
  • అమరావతిలో కేవలం 8 కి.మీ పరిధిలో 53 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాలకు లక్షా 10 వేల కోట్లు రూపాయల ఖర్చు అవుతుందని చంద్రబాబే చెప్పారు.
  • ఇన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు.
  • కానీ చంద్రబాబు అధికారంలో ఉండగా ఇక్కడ ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈ లెక్కన మరో వందేళ్లకు రెండు, మూడింతల రెట్టింపు అవుతుంది.
  • అమరావతి రాజధానిని ఎక్కడికీ తరలించడంలేదు. విశాఖ, కర్నూలులో కూడా రాజధానులు పెడతామని చెప్పాం.
  • ఈ మూడేళ్ళలో ప్రజా సంక్షేమానికి అక్షరాలా రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశాం.
  • విశాఖ నెంబర్ 1 సిటీ. అక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. పది నుంచి పదిహేను వేల కోట్లు ఖర్చు పెడితే చాలా అభివృద్ధి అవుతుంది.
  • అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే పార్లమెంట్ పరిధికొకటి చొప్పున 26 జిల్లాలు ఏర్పాటు చేశాం.
  • అందుకే మూడు రాజధానులను మేము సమర్ధిస్తాం.. ఏర్పాటు చేస్తాం. అమరావతితో పాటు కర్నూలు, విశాఖలో కూడా రాజధానులు ఉండాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 4 =