బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక భేటీ, మారనున్న రాజకీయ సమీకరణాలు?

Political Strategist Prashant Kishor Meets Bihar CM Nitish Kumar Likely To Change Equations Before 2024 Elections, Prashant Kishor Meets Bihar CM, Political Strategist Prashant Kishor, Nitish Kumar Met With Prashant Kishor, Bihar CM Nitish Kumar, Mango News, Mango News Telugu, Political Strategist Prashant Kishor, Nitish Kumar Latest News And Updates, Bihar CM , Prashant Kishor Meets Nitish Kumar, Latest Political News

ప్రస్తుత రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరొందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలుసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 2 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం విశేషం. జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో ఆయన మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. అయితే భేటీలో ప్రధానంగా వారు ఏం చర్చించుకున్నారు? అనే విషయమై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు కూడా ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఇద్దరూ కలిసిపోనున్నారని, అలాగే ప్రశాంత్ కిశోర్‌కు జేడీయూ అధ్యక్ష పదవిని సీఎం నితీశ్ కుమార్ ఆఫర్ చేశారని.. ఇలా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ భేటీపై ఇరువురు నేతలూ స్పందించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని, ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. తామిద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరుగలేదని చెప్పారు. ఇక ఇదే విషయంపై ప్రశాంత్ కిశోర్ కూడా వివరణ ఇచ్చారు. ఇంతకుముందు తాను బిజీగా ఉండడంతో కబురు వచ్చినా సీఎం నితీశ్ కుమార్‌ని కలవలేకపోయానని, అందుకే వెళ్లలేకపోయానని తెలిపారు. నితీశ్ కుమార్‌ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కలుస్తానని చెప్పారు. నితీశ్ కుమార్ ఇక్కడ పెద్ద నాయకుడు, అతనికి ప్రశాంత్ కిశోర్ అవసరం లేదని, నేను ప్రస్తుతం బీహార్‌లో నా ప్రచారంలో బిజీగా ఉన్నానని వెల్లడించారు. రాష్ట్రంలో యువ‌త‌కు ఏటా ప‌ది ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తే కూట‌మిలో చేరే విష‌యం ఆలోచిస్తాన‌ని ఇప్పటికే తాను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాగా గతంలో ప్రశాంత్ కిశోర్ జేడీయూలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను నితీశ్ కుమార్‌ ఉపాధ్యక్షుడిగా నియమించారు కూడా. అయితే 2019లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను ప్రశాంత్ కిశోర్ వ్యతిరేకించడంతో, ఆయనను పార్టీ నుంచి తొలగించారు. అలాగే 2015లో జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల కోసం ఆర్జేడీ, జేడీయూలను ఏకతాటిపైకి తేవడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. ఇక ఇటీవల ఆయన బిహార్‌లో ‘జన సూరజ్’ పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఈ పేరుతోనే రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి తాజా భేటీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − nine =