అడ్వాన్స్‌డ్ టెలిస్కోప్‌లను కూడా ఉపయోగిస్తున్నాయా?

Are We Secretly Being Watched By Aliens, Aliens Secretly Being Watched, Aliens Watched, SETI, Aliens, Secretly Watched By Aliens, Aliens Using Advanced Telescopes, Latest Aliens News, Aliens News 2024, Aliens On Earth, Earth, Space City, Technology, Mango News, Mango News Telugu
SETI,aliens, secretly watched by aliens,aliens using advanced telescopes

ఎన్నో విశ్వ రహస్యాలను ఛేదించినా కూడా గ్రహాంతర వాసులు మాత్రం  సైంటిస్టులకు సవాల్ విసిరుతూనే ఉంటారు. అందుకే గ్రహాంతరవాసులకు సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగుతూనే ఉంటాయి. అదే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ  కూడా ఏలియన్స్‌ గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలన్న కుతూహలాన్ని పెంచుతుంది.

ప్రస్తుతం గ్రహాంతరవాసుల గురించి బయటపడ్డ  అలాంటి విషయం.. ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీని పెంచుతుంది. గ్రహాంతర వాసులు మనల్ని రహస్యంగా గమనిస్తారంటూ ‘పీర్-రివ్యూడ్ పేపర్ 2024 ఎడిషన్’ పేరుతో యాక్టా ఆస్ట్రోనాటికా’లో ఓ ఆర్టికల్ వెలువడింది.  ‘అధునాతన గ్రహాంతర నాగరికతలకు మనం కనిపిస్తామా?’ అనే హెడ్డింగ్‌తో పబ్లిష్ అయిన ఓ ఆర్టికల్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది.

అంతేకాదు.. భూమి అంతా ఉన్న మేజర్ ల్యాండ్ మార్క్‌ను కూడా..ఏలియన్లు స్నూపింగ్ చేస్తున్నాయని  అధ్యయనం చెబుతోంది. వేల కాంతి సంవత్సరాల దూరంలో కూర్చొని .. తమ అల్ట్రా- అడ్వాన్స్‌డ్ టెలిస్కోప్‌లను గ్రహాంతరవాసులు ఉపయోగిస్తున్నారని అధ్యయనం వెల్లడిస్తోంది.

మరికొన్ని కాంతిసంవత్సరాల తర్వాత భూ గోళంపై భారతీయులు, రోమన్లు, గ్రీకులు,  ఈజిప్షియన్ల కాలంలో భూమిపై నిర్మించిన భవనాల వంటి నిర్మాణాలను ఏలియన్స్ ఎంచుకోగలిగే అవకాశం కూడా ఉందని  సైంటిస్టులు అంటున్నారు. అయితే ఇదంతా భౌతిక శాస్త్ర నియమాల ఆధారంగా జరిగిన అధ్యయనంతో ముడిపడి ఉందని ఓస్మనోవ్, సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్  ఇన్‌స్టిట్యూట్‌‌కు చెందిన సైంటిస్టులు చెబుతున్నారు.

కానీ ఏలియన్స్ భూ గ్రహంపై ఉండే రియల్ టైమ్‌లో మాత్రం.. మానవులను చూసే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. కాంతి అంతరిక్షంలో ప్రయాణించడానికి పట్టే సమయం వల్ల..  ఏలియన్స్ మనల్ని గమనించే సమయం.. కాంతి సంవత్సరాలను బట్టి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. మానవుల కంటికి ఏలియన్స్ కనబడాలంటే ఇంకా అనేక వేల కాంతి సంవత్సరాలు పట్టొచ్చని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + sixteen =