రేపు మేఘాలయ, త్రిపురలలో ప్రధాని మోదీ పర్యటన, 6800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

PM Modi will visit Meghalaya Tripura on Tomorrow will Inaugurate Lay foundation Stone of Projects Worth Rs 6800 Cr,Prime Minister Modi,Modi Visit To Meghalaya,Modi Visit To Tripura,Modi Inauguration Ceremonies,Modi Foundation Stones,Meghalaya Projects Worth 6800 Crores,Mango News,Mango News Telugu,Meghalaya Tourism,Meghalaya Destinations,Meghalaya Government,Meghalaya Assembly,Meghalaya Weather,Meghalaya Capital,Meghalaya Tourist Places,Meghalaya News,Tripura News,Tripura State,Tripura Cm,Tripura State,Tripura Population,Tripura News,Tripura Assembly

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (డిసెంబర్ 18, ఆదివారం) మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా షిల్లాంగ్‌లో ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు షిల్లాంగ్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈశాన్య మండలి సమావేశానికి ప్రధాని హాజరుకానున్నారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు షిల్లాంగ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని రూ.2450 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకుని, మధ్యాహ్నం 2:45 గంటలకు బహిరంగ సభలో రూ.4350 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈశాన్య మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్) అధికారికంగా నవంబర్ 7, 1972న ప్రారంభించబడిందని, ఈశాన్య ప్రాంతం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ఈ మండలి కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చి, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, క్రీడలు, జలవనరులు, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు వంటి రంగాల్లోని కీలకమైన గ్యాప్ ప్రాంతాలలో విలువైన మూలధనం మరియు సామాజిక మౌలిక సదుపాయాలను రూపొందించడంలో సహాయపడిందన్నారు. ఈ క్రమంలో షిల్లాంగ్‌లో ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =