ఒమిక్రాన్ పై సైన్యానికి రక్షణశాఖ మార్గదర్శకాలు

Indian Defence Issues the Guidelines for the Army Over Omicron Scare,Omicron Scare,Indian Defence Issues New Guidelines,Covid-19 Live Updates,Indian Army,Mango News, Mango News Telugu,Coronavirus,Coronavirus Updates,Covid-19 New Guidelines,Covid-19 Omicron Variant,Omicron,Omicron Updates,Omicron Latest News,Army,Indian Defence,Indian Defence News,Indian Defence Guidelines,Indian Defence Guidelines To Army,Omicron New Guidelines,Indian Army News,Indian Army Covid Guidelines,Covid-19 Omicron Variant Live Updates,Covid-19 Omicron Variant Updates,Covid-19 Latest News,Covid-19 Latest Updates,Omicron Variant,Omicron Variant News,Omicron Variant Updates,Indian Army Guidelines,COVID-19,Coronavirus India,Omicron Scare In India

దేశంలో కరోనా కొత్త వైరస్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపధ్యంలో.. సైనిక బలగాలు, సిబ్బంది అందరికీ రక్షణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. గత వారంలో సైనిక సిబ్బందిలో వైరస్ పాజిటివిటీ రేటు 2.34గా ఉంది. ఏదైనా ఒక సైనిక క్యాంప్ లో వైరస్ పాజిటివిటీ రేటు ఒక శాతాన్ని మించితే.. సెలవుల తర్వాత విధుల్లో చేరే వారందరికీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అలాగే, సైన్యంలో తరచూ జరిగే గ్రూప్ మీటింగ్స్ రద్దు చేయాలని సూచించింది. అధికారుల సమావేశాలన్నీ వర్చువల్ విధానంలోనే జరుపుకోవాలని స్పష్టం చేసింది. ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్ వసతులను సిద్ధం చేసుకోవాలని తెలిపింది.

వారపు సగటు పాజిటివిటీ రేటు 2 నుంచి 5 వరకు ఉంటే సెలవుల తర్వాత విధుల్లో చేరే వారిని వారంరోజుల పాటు క్యారెంటైన్లో ఉంచాలని కరోనా పరీక్ష తర్వాతే వెలుపలకు అనుమతించాలని వివరించింది. ఒకవేళ పాజిటివిటీ రేటు 5 నుంచి 10 వరకు ఉంటే సైనిక కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యపై పరిమితి విధించాలని ఆదేశించింది. సైనిక ఆసుపత్రులలో కోవిడ్ సంబంధిత సేవలను, అత్యవసర సేవలను అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. పడకల ఆక్యుపెన్సీ రేషియో 40 శాతం దాటిన సమయంలో.. అత్యవసరం కాని సాధారణ శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eighteen =