ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా అమరావతి రైతుల ధర్నా, జాతీయస్థాయిలో మద్దతుకు యత్నం

Amaravati Farmers Held Dharna at Delhi's Jantar Mantar, During Three Years Completed For The Capital Movement Today,Ap Capital Amaravati Case, Hearing In Supreme Court Today,Amaravati Case Key Orders Issued,Mango News,Mango News Telugu,Amaravati Farmers Protest,Amaravati Farmers Pada Yatra,Amaravati Farmers Latest News And Updates,Amaravati News And Live Updates,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy, Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు దేశ రాజధాని ఢిల్లీలో తమ నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేపట్టారు. నేటితో రాజధాని ఉద్యమం ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమరావతి రైతులు ధర్నాకు దిగారు. వివిధ కార్యక్రమాల కోసం అమరావతి రైతులు, మహిళలు రెండు రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ కాలంగా ఉద్యమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజధానిలో తమ నిరసనను తెలుపడానికి వారు సిద్ధమయ్యారు. 15వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రాజధాని రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. ‘అమరావతి పరిరక్షణ సమితి’ నేతృత్వంలో వారు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాను కొనసాగించనున్నారు. ఈ ధర్నాకు వామపక్ష పార్టీల నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్బంగా రైతులు పలువురు కేంద్ర మంత్రులను, పలు పార్టీల ఎంపీలను కలిసి మద్దతు కోరనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 11 =