రేపు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్న పీఎం మోదీ

Grand Finale of Smart India Hackathon, Grand Finale of Smart India Hackathon-2020, PM Modi, PM Modi Address Grand Finale of Smart India Hackathon, pm narendra modi, Smart India Hackathon, Smart India Hackathon Grand Finale, Smart India Hackathon-2020

స్మార్ట్ ఇండియా హ్యాకథన్ -2020 గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1, శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో పీఎం మోదీ సంభాషించనున్నారు. నిత్య జీవనంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి విద్యార్థులకు ఒక వేదికను అందించడం, అలాగే సమస్యను పరిష్కరించే మనస్తత్వాన్ని, కొత్త విషయాలను, ఉత్పతులను ఆవిష్కరించే సంస్కృతిని అలవాటు చేసేందుకు దేశవ్యాప్తంగా స్మార్ట్ ఇండియా హ్యాకథన్ రూపొందించబడింది. యువ విద్యార్థులను కొంచెం భిన్నమైన విషయాలను ఆలోచించేలా ప్రోత్సహించడంలో ఇది ఎంతగానో విజయవంతం అయింది.

స్మార్ట్ ఇండియా హ్యాకథన్ లో 2017 లో 42000 మంది విద్యార్థులు పాలుపంచుకోగా, 2018 వ సంవత్సరంలో ఆ సంఖ్య 1 లక్షకు చేరింది. 2019 లో 2 లక్షల మంది, 2020 లో 4.5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథన్ -2020 గ్రాండ్ ఫినాలే లో పీఎం మోదీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదించిన జాతీయ విద్యా విధానం-2020 గురించి కూడా విద్యార్థులకు వివరించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 7 =