ప్రధాని మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పదవికి పీకే సిన్హా రాజీనామా

Mango News, PK Sinha, PK Sinha PMO, PK Sinha resigns, PM Modi’s Principal Adviser P K Sinha resigns, PM Modi’s Principal Adviser PK Sinha, PM Modi’s Principal Adviser PK Sinha Quits, PM Modi’s Principal Advisor P.K. Sinha Resigns, pm narendra modi, PM Narendra Modi’s Principal Advisor PK Sinha Resigns, Principal Advisor to PM Modi, Principal Advisor to PM Modi PK Sinha, Principal Advisor to PM Modi PK Sinha resigns

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి ఓ సీనియర్ అధికారి వైదొలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పీకే సిన్హా సోమవారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రధాని మోదీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పీకే సిన్హా పేర్కొన్నట్టు తెలుస్తుంది. పీకే సిన్హా 1977 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ముందుగా గతంలోని యూపీఏ ప్రభుత్వంతో పాటుగా, 2014 లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన కేంద్రప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలకు ఆయన సెక్రెటరీగా పనిచేశారు.

అనంతరం జూన్ 2015 లో పీకే సిన్హాను కేబినెట్ సెక్రెటరీగా నియమించబడ్డారు. ఇక జూన్ 2019లో ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఆగస్టు 30, 2019 న ఆయన్ను ప్రధానమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పదవిలో నియమించారు. ఆ క్రమంలోనే 2019 సెప్టెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీకి పీకే సిన్హా ప్రిన్సిపల్ అడ్వైజర్ గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యంత విశ్వసనీయ అధికారులలో ఒకరిగా పీకే సిన్హా పేరొందారు. తాజాగా పీకే సిన్హా ప్రిన్సిపల్ అడ్వైజర్ పదవి నుండి వైదొలగడంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =