జూన్ 19 నుండి దేశంలోని 11 రాష్ట్రాల్లో పోలియో సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే ప్రారంభం

Polio Sub-National Immunization Day will be Conducted 11 States UTs From June 19th, UTs From June 19th, 11 States, Polio Sub-National Immunization Day will be Conducted 11 States, Polio Sub-National Immunization Day, Health Ministry said the first Sub-National Immunization Day of 2022 for administering Polio vaccine drops, Sub-National Immunization Day of 2022 for administering Polio vaccine drops will start tomorrow in 11 states, Polio vaccine drops, Polio Immunization 2022, first Sub-National Immunization Day for 2022, Polio Sub-National Immunization Day News, Polio Sub-National Immunization Day Latest News, Polio Sub-National Immunization Day Latest Updates, Polio Sub-National Immunization Day Live Updates, 2022 Polio vaccine drops, Bihar, Chandigarh, Delhi, Gujarat, Haryana, Jharkhand, Maharashtra, Punjab, Rajasthan, Uttarakhand, West Bengal, Mango News, Mango News Telugu,

పోలియో సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే జూన్ 19 నుండి 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు వారికీ పోలియో చుక్కలు వేసేందుకు 2022లో మొదటి పోలియో సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డేను జూన్ 19 నుండి బీహార్, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పోలియో ప్రచారంలో భాగంగా బూత్, ఇంటింటికి, మొబైల్ మరియు ట్రాన్సిట్ టీమ్‌ల ద్వారా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 3.9 కోట్ల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లలకు అదనపు రక్షణను అందించడానికి కేంద్ర ప్రభుత్వం తన రొటీన్ వ్యాధి నిరోధక కార్యక్రమంలో ఇంజెక్ట్ చేయదగిన ఇనాక్టివేటెడ్ పోలియోవైరస్ వ్యాక్సిన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

మరోవైపు భారత్ మార్చి 27, 2014న పోలియో రహిత దేశంగా ధృవీకరించబడిన విషయం తెలిసిందే. కాగా దేశంలో చివరి పోలియో కేసు జనవరి 13, 2011న పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు డబ్ల్యూహెఛ్ఓ, యూనిసెఫ్, రోటరీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు మరియు ఇతర భాగస్వాములు పోలియో నిర్మూలనలో మాత్రమే కాకుండా సాధారణ వ్యాధి నిరోధక చర్యలను మెరుగుపరచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తల్లిదండ్రులందరూ 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆరోగ్య శాఖ కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =