గుజరాత్‌లో రూ. 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

PM Narendra Modi Inaugurates and Lays Foundation Stones For Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, PM Narendra Modi Lays Foundation Stones For Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, PM Narendra Modi Inaugurates Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, PM Modi Inaugurates and Lays Foundation Stones For Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, PM Modi Inaugurates Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, PM Modi Lays Foundation Stones For Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, Foundation Stones For Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, Inaugurates Several Projects Worth Over Rs 21000 Cr in Gujarat, Several Projects Worth Over Rs 21000 Cr, Gujarat, Gujarat Projects, Gujarat Projects News, Gujarat Projects Latest News, Gujarat Projects Latest Updates, Gujarat Projects Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

గుజరాత్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లలో మహిళలకు సాధికారత కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రూ. 21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వడోదరలో జరిగిన గుజరాత్ గౌరవ్ అభియాన్‌లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళా సాధికారతతోనే భారత్ అభివృద్ధి సంపూర్ణమవుతుందని, అందుకే మహిళల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో వారికి అవకాశం కల్పించేలా నూతన విధానాలు రూపొందిస్తునట్లు తెలిపారు. ఆర్మీ నుంచి గనుల దాకా అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వారి సంక్షేమం కోసం ముద్రా రుణాల లబ్ధిదారులలో 70% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. గిరిజన మహిళలకు ప్రత్యేకంగా పోషకాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ.

ప్రధాని తన పర్యటనలో 16,000 కోట్ల రూపాయల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా 357 కి.మీ పొడవైన కొత్త పాలన్‌పూర్ – మదర్ సెక్షన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ను ప్రారంభించారు. అలాగే 166 కి.మీ పొడవైన అహ్మదాబాద్-బొటాడ్ సెక్షన్ గేజ్ మార్పిడి, 81 కి.మీ పొడవాటి పాలన్‌పూర్ – మిథా సెక్షన్‌కు విద్యుద్దీకరణ పనులను ప్రారంభించారు. సూరత్, ఉద్నా, సోమనాథ్ మరియు సబర్మతి స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ద్వారా మొత్తం 1.38 లక్షల ఇళ్లు నిర్మించబడిన ఇళ్లను లబ్దిదారులకు అందించారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో సుమారు రూ. 1,800 కోట్ల విలువైన ఇళ్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,530 కోట్లకు పైగా విలువైన ఇళ్లు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =