పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన నిర్ణయం.. అవినీతి ఆరోపణలతో ఆరోగ్య మంత్రి బ‌ర్త‌ర‌ఫ్

Punjab CM Bhagwant Mann Sacks Health Minister Vijay Singla on Corruption Charges, CM Bhagwant Mann Sacks Health Minister Vijay Singla on Corruption Charges, Bhagwant Mann Sacks Health Minister Vijay Singla on Corruption Charges, Punjab Chief Minister Bhagwant Mann Sacks Minister Vijay Singla For Corruption, Bhagwant Mann Sacks Minister Vijay Singla For Corruption, Chief Minister Bhagwant Mann Sacks Minister Vijay Singla For Corruption, Chief Minister Bhagwant Mann sacks Health Minister Vijay Singla on charges of corruption, charges of corruption, Health Minister Vijay Singla, Punjab health minister Vijay Singla arrested after Punjab CM Bhagwant Mann sacks him for corruption, health minister Vijay Singla arrested, Punjab health minister Vijay Singla arrested, Punjab Chief Minister Bhagwant Mann has sacked health minister Vijay Singla from the state cabinet over corruption charges, health minister Vijay Singla arrest News, health minister Vijay Singla arrest Latest News, health minister Vijay Singla arrest Latest Updates, health minister Vijay Singla arrest Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన సమయంలో చెప్పినట్లుగానే తన ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని నిరూపించారు. దీనికోసం ఎంతటి కఠినమైన నిర్ణయానికైనా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. తాజాగా అవినీతి ఆరోపణలపై పంజాబ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను కేబినెట్ నుంచి తొలగించారు. మంత్రి సింగ్లా పై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతోనే మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారని, ఈ మేరకు పంజాబ్ సీఎం కార్యాల‌యం ఒక ప్ర‌క‌టనలో తెలిపింది. మంత్రివర్గం నుండి తొలగించడమే కాకుండా ఆయ‌నను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని కూడా సీఎం ఆదేశించారని సీఎంఓ పేర్కొంది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా భ‌గ‌వంత్ మాన్ చర్యను ప్రశంసించారు. ఈరోజు మీరు తీసుకున్న ఈ చర్య నాకు కన్నీళ్లను తెప్పిస్తోంది, ‘ఆప్’ పార్టీని చూసి దేశం గర్విస్తోంది అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా రాష్ట్రంలో వివిధ కాంట్రాక్టుల విష‌యంలో ‘ఒక్క శాతం’ క‌మిష‌న్ ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేసినట్లు ప‌క్కా ఆధారాలు లభించడం వల్లనే సీఎం భగవంత్ మాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని సీఎంఓ తెలిపింది. ప్రజలు ఎన్నో అంచనాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారని, ఒక్క శాతం అవినీతిని కూడా సహించేది లేదని భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ‘ఆప్’ నిజాయితీగల పార్టీ. మా ప్రభుత్వం ఒక రూపాయి కూడా అవినీతిని సహించదు. రాష్ట్రవ్యాప్తంగా నేను చేసిన పర్యటనల సమయంలో ప్రజల దృష్టిలో ఈ ఆశను నేను చూశాను. ఎవరైనా తమను అవినీతి బురద నుండి బయటపడేయాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికలప్పుడు ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ కూడా మా అందరి దగ్గరా మాట తీసుకున్నారు. మేము ఆయనకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని భగవంత్ మాన్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =