టాస్క్ ఫోర్స్-2024, పొలిటికల్ అఫైర్స్, సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్స్ ప్రకటించిన కాంగ్రెస్

Sonia Gandhi Forms Task Force-2024 Political Affairs Group Central Planning Group, Sonia Gandhi Forms Central Planning Group, Sonia Gandhi Forms Political Affairs Group, Sonia Gandhi Forms Task Force-2024, Congress president Sonia Gandhi forms 3 groups, Congress president Sonia Gandhi forms Task Force-2024 Political Affairs Group Central Planning Group, Congress forms political panel, Central Planning Group, Political Affairs Group, Task Force-2024, Congress interim president Sonia Gandhi has announced the formation of an eight-member political affairs group, eight-member Of political affairs group, Congress interim president Sonia Gandhi, Congress president Sonia Gandhi, Political Affairs Group News, Political Affairs Group Latest News, Political Affairs Group Latest Updates, Political Affairs Group Live Updates, Mango News,

కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ లో ‘నవ సంకల్ప్ శిబిర్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యచరణ సహా పలు అంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా మూడు గ్రూప్ లను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల బృందం (పొలిటికల్ అఫైర్స్ గ్రూప్) మరియు టాస్క్ ఫోర్స్-2024 తో పాటుగా అక్టోబర్ 2 నుంచి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ను సమన్వయం చేసేందుకు కేంద్ర ప్రణాళికా బృందం (సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్) ఏర్పాటు చేస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది.

టాస్క్‌ఫోర్స్‌లోని ప్రతి సభ్యునికి ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్, మీడియా, ఔట్‌రీచ్, ఫైనాన్స్ మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిర్దిష్ట టాస్క్ కేటాయించబడుతుందన్నారు. వారు నియమించబడిన బృందాలను కలిగి ఉంటారని, ఆ వివరాలు తరువాత తెలియజేస్తామని చెప్పారు. ఉదయపూర్ నవ్ సంకల్ప్ డిక్లరేషన్ మరియు ఆరు గ్రూపుల నివేదికలను కూడా టాస్క్ ఫోర్స్ అనుసరిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్రూపుల్లో జీ-23 నాయకుల్లో భాగమైన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మతో పాటుగా, గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలుకు కూడా చోటు కల్పించారు.

పొలిటికల్ అఫైర్స్ గ్రూప్:

  1. రాహుల్ గాంధీ
  2. మల్లికార్జున్ ఖర్గే
  3. గులాం నబీ ఆజాద్
  4. అంబికా సోనీ
  5. దిగ్విజయ సింగ్
  6. కెసి వేణుగోపాల్
  7. జితేంద్ర సింగ్
  8. ఆనంద్ శర్మ

టాస్క్ ఫోర్స్-2024:

  1. పి.చిదంబరం
  2. ముకుల్ వాస్నిక్
  3. జైరాం రమేష్
  4. కెసి వేణుగోపాల్
  5. అజయ్ మాకెన్
  6. ప్రియాంక గాంధీ
  7. రణదీప్ సింగ్ సూర్జేవాలా
  8. సునీల్ కానుగోలు

సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్:

  1. దిగ్విజయ సింగ్
  2. సచిన్ పైలట్
  3. శశి థరూర్
  4. రవ్‌నీత్ సింగ్ బిట్టు
  5. కేజే జార్జ్
  6. జోతిమణి
  7. ప్రద్యుత్ బోర్డోలోయ్
  8. జితు పట్వారీ
  9. సలీమ్ అహ్మద్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 15 =