తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా.. ప్రసంగంపై సీఎం స్టాలిన్‌ తీవ్ర అభ్యంతరం, వాకౌట్ చేసిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి

Tamil Nadu Governor RN Ravi Walks Out From Assembly Amid Row with CM MK Stalin Over His Speech,Tamil Nadu Governor RN Ravi,RN Ravi Walks Out,Tamil Nadu Assembly,Mango News,Mango News Telugu,Tamilnadu Chief Minister Name,Tamilnadu Chief Minister Health Insurance Scheme,Tamil Nadu Chief Minister Relief Fund,Tamil Nadu Chief Minister List,Stalin Tamilnadu Chief Minister,Governor Of Tamil Nadu,Cm Of Tamil Nadu 2023,Chief Minister Of Tamil Nadu 2022,Chief Minister Of Tamil Nadu,Legislative Assembly In Tamil,Tamil Nadu Assembly Constituency List,Tamil Nadu Assembly Election Results,Tamil Nadu Assembly Live,Tamil Nadu Assembly Ministers,Tamil Nadu Assembly News Today Live,Tamil Nadu Assembly Seats,Tamil Nadu Legislative Council

గతకొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వం మరియు గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ రవి అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సందర్భంగా డీఎంకే ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగంలో పలు మార్పులు చేశారు. దీంతో ఆయన ప్రసంగంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. తమిళంలో ముద్రించిన అసలు ప్రసంగాన్ని మాత్రమే రికార్డుల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అయితే దీనిపై అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ రవి గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ గీతం ఆలపించకముందే సభ నుంచి వాకౌట్ చేశారు.

కాగా దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన గవర్నర్ ఆర్ఎన్ రవి తన ప్రసంగంలో భాగంగా తమిళంలో ఇచ్చిన దానికి ఆంగ్ల అనువాదం చేస్తూ పలుచోట్ల తడబడ్డారు. అలాగే ప్రభుత్వం అందించిన ప్రసంగం ప్రతిలోని 12వ పాయింట్‌లో కొంత భాగాన్ని దాటవేశారు. ఇది రాష్ట్రం యొక్క శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశం కావడం గమనార్హం. అలాగే రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మరియు మహమ్మారిపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దానికి సంబంధించి 64వ పాయింట్‌ను కూడా ఆయన దాటవేశారు. వీటితో పాటుగా తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సహా మిత్ర పక్షాల ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ అనూహ్యంగా తమిళంలో ముద్రించిన అసలు ప్రసంగాన్ని మాత్రమే రికార్డుల్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ సభలో తీర్మానం పెట్టడం విశేషం. ప్రసంగం కాపీలో ‘ద్రావిడ మోడల్’ మరియు ‘తమిళనాడు’ అని వచ్చిన సందర్భంలో గవర్నర్ కావాలనే వాటిని ఉచ్ఛరించకుండా ప్రత్యామ్నాయ పదాలను వాడారని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. అయితే దీనిపై కినుక వహించిన గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార పార్టీ సహా మిత్ర పక్షాల సభ్యులు తమిళ ప్రజలను గవర్నర్‌ కించపరుస్తున్నారని ఆరోపిస్తూ అసెంబ్లీలో ఆందోళనకు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =