నెల్లూరులో నేడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభ.. పాల్గొన్న ఏపీ సీఎం జగన్

CM Jagan Attends Mourning Ceremony of Late Minister Mekapati Goutham Reddy in Nellore Today, YS Jagan Visits Nellore Will Attend Mourning Ceremony Of Late YSRCP Minister, Late YSRCP Minister, YS Jagan Visits Nellore, YS Jagan Will Attend Mourning Ceremony Of Late YSRCP Minister, Mourning Ceremony Of Late YSRCP Minister, YSRCP Minister, Mourning Ceremony, mourning ceremony of the late YSRCP Minister Goutham Reddy, YSRCP Minister Goutham Reddy, YSRCP Minister, Goutham Reddy, YSRCP President would attend the mourning ceremony of the late YSRCP Minister Mekapati Goutham Reddy, Mekapati Goutham Reddy, Former Minister of Industries of Andhra Pradesh, Mekapati Goutham Reddy Former Minister of Industries of Andhra Pradesh, Former Andhra Pradesh Minister, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభ ఈరోజు నెల్లూరులోని గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ ‌రెడ్డి నెల్లూరు పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో మొదటగా సీఎం వైఎస్ జగన్‌మెహన్‌ రెడ్డి తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం గన్నవరం నుండి ‌ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, రోడ్డు మార్గాన వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన గౌతమ్‌ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి  నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్దిని, కుటుంబ సభ్యులను సీఎం జగన్‌మెహన్‌ రెడ్డి ఓదార్చారు.

ఈ కార్యక్రమంలో సీఎం జగన్  మాట్లాడుతూ.. గౌతమ్‌ మన మధ్య లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గౌతమ్‌ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడిగా, ప్రతి విషయంలో నాకు తోడుగా ఉన్నాడు. నా కోరిక మేరకు తను రాజకీయాల్లోకి వచ్చాడు. గౌతమ్‌ రెడ్డి మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను సమర్ధవంతంగా నిర‍్వహించారు. చివరి క్షణం వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేశారు. నెల్లూరులోని సంగం బ్యారేజీని మే 15 నాటికి పూర్తి చేసి గౌతమ్‌ గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతామని తెలిపారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో.. నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో బందోబస్తు విధుల్లో పాల్గొననున్న సిబ్బందితో ఎస్పీ సీహెచ్‌ విజయారావు సమావేశం నిర్వహించారు. హెలిప్యాడ్, కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ముందస్తు అనుమతి పొందిన వ్యక్తులను మాత్రమే ముఖ్యమంత్రి వద్దకు అనుమతించాలని, దీనికి ముందుగా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనీఖలు చేయాలని సూచించారు. దీంతో పోలీసు యంత్రాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eleven =