కెన్యా అధ్యక్షుడిగా ఎన్నికైన విలియం రూటోను అభినందించిన ప్రధాని మోదీ

PM Modi Congratulates William S Ruto on Being Elected the President of Kenya, PM Modi Congratulates William S Ruto , William S Ruto Elected As President of Kenya, William S Ruto New President Kenya, PM Modi Greets William S Ruto, William S Ruto Kenya New President, Mango News, Mango News Telugu, President of Kenya, PM Narendra Modi, Kenya President William S Ruto, PM Modi Latest News And Updates

కెన్యా ప్రెసిడెంట్/అధ్యక్ష ఎన్నికల అధికారిక ఫలితాలు ప్రకటించబడ్డాయి. కెన్యా 5వ అధ్యక్షుడిగా విలియం సమోయి రూటో ప్రకటించబడ్డాడు. ఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రూటోకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “కెన్యా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు విలియమ్స్ రూటోకు అభినందనలు. ఇరు దేశాల చారిత్రాత్మక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ముందుగా ఆగస్టు నెలలో విలియం రూటో 50.49 శాతం ఓట్లతో, తన ప్రత్యర్థి రైలా ఒడింగాపై (48.85% ఓట్లు) గెలుపొందినట్లు ఐఈబీసీ ప్రకటించింది. అయితే ప్రతిపక్ష అభ్యర్థి రైలా ఒడింగా కెన్యా అధ్యక్ష ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల సంఘంలోని నలుగురు సభ్యులు కూడా ఫలితాలను తిరస్కరించారు. దీంతో అధికార ప్రకటనకు సమయం పట్టింది. ఈ నేపథ్యంలో కెన్యా సుప్రీంకోర్టు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అధికారిక ఫలితాలపై నమోదైన సవాళ్లపై విచారణ జరిపి, వాటిని ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు కనుగొనబడలేదని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడుగా విలియం రూటో ఎన్నికైనట్టు ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + four =