డిసెంబర్ 15 నుంచి1.40 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహణ

Railway Recruitment Exams for 1.4 Lakh Vacancies Commencing From December 15th,Railway NTPC 2020,Railway NTPC Vacancy 2020,Railway TC Recruitment 2020,Railway NTPC Recruitment 2020,Railway Recruitment 2020,Railway Jobs 2020,Railway Recruitment,NTPC Recruitment 2020,Railway Recruitment 2020,Railway JE Recruitment 2020,ECR Railway Recruitment 2020,NTPC Railway Recruitment 2020,Indian Railway Recruitment 2020,Indian Railways Recruitment 2020 Across India,Railway Recruitment,Railway Recruitment Exams,Railway Recruitment Exams for 1.4 Lakh Vacancies,Mango News Telugu,Mango News

దేశంలో 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల‌(ఆర్ఆర్‌బి) పరిధిలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబ‌ర్ 15 నుంచి జ‌ర‌గ‌నున్న ప‌రీక్ష‌ల‌కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ఉద్యోగాల కోసం 2.44 కోట్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. తోలి విడతలో ఐసోలేటెడ్ మరియు మినిస్టీరియల్ కేటగిరి ఉద్యోగాలకు డిసెంబ‌ర్ 15 నుంచి డిసెంబ‌ర్ 18 వ‌ర‌కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) జరగనుంది. ఇక రెండో విడతలో నాన్‌ టెక్నికల్‌ పాపులారిటీ-ఎన్‌టీపీసీ కేటగిరీకి డిసెంబ‌ర్ 28 నుంచి మార్చి 2021 వ‌ర‌కు, మూడో విడతలో లెవల్-1 ఉద్యోగాలకు ఏప్రిల్ 2021 నుంచి జూన్ 2021 చివ‌రి వ‌ర‌కు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 15 నుంచి ప‌రీక్ష‌లకు హాజరయ్యే అభ్య‌ర్ధుల‌కు వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే న‌గ‌రం, ప‌రీక్ష తేదీ వంటి విష‌యాల‌ను ఈమెయిల్‌, ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసీజ‌ర్ల‌ ప్రకారం ఆర్ఆర్‌బిలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయని, భౌతిక దూరం పాటించ‌డం, విధిగా మాస్కులు ధ‌రించ‌డం, శానిటైజ‌ర్లు వాడ‌డం వంటి నిబంధనలు అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాన్‌ టెక్నికల్‌ పాపులారిటీ-ఎన్‌టీపీసీ కేటగిరీలో (గార్డులు, ఆఫీస్‌ క్లర్క్‌లు, కమర్షియల్‌ క్లర్క్‌ల పోస్టులు) 35,208, ఐసోలేటెడ్ మరియు మినిస్టీరియల్ కేటగిరిలో (స్టెనో, టీచ్‌లు) 1663, లెవల్-1 ఖాళీలు (ట్రాక్ మెయింటెనర్‌లు, పాయింట్‌మ్యాన్) 103769 తో కలిపి రైల్వేశాఖలో మొత్తం 1.4లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =