బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

last date of kyc update in sbi bank, Mango News, Omicron spread, periodic updation of kyc for politically exposed person, RBI Extends Deadline for Periodic KYC Update, RBI Extends Deadline for Periodic KYC Update by 3 Months, RBI extends deadline for periodic KYC update by 3 months till March 31, RBI Extends Deadline for Periodic KYC Update by 3 Months until 31 March, RBI Extends Deadline for Periodic KYC Update by 3 Months until 31 March 2022, rbi guidelines for kyc updation, rbi kyc guidelines 2022, rbi kyc master circular, sbi kyc update last date 2022, time limit for periodic updation of kyc

బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. సెంట్రల్ బ్యాంక్ KYC అప్‌డేట్ గడువును ఆర్బీఐ మరో 3 నెలలు పొడిగించింది. KYC అప్‌డేట్ గడువును 2022 మార్చి 31 వరకు పొడిగించింది. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనిశ్చితి కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. KYC కింద కస్టమర్‌లు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన రుజువును అందించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్‌లో మాత్రమే కాకుండా డబ్బు లావాదేవీలు, అవసరమైన సేవలకు సంబంధించిన అన్ని సేవలలో KYC అవసరం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బ్యాంక్ ఖాతాలకు కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం, తక్కువ రిస్క్ ఉన్న ఖాతాలకు 10 సంవత్సరాలకు ఒకసారి కేవైసీని అప్‌డేట్ చేయాలని బ్యాంకులకు సూచించబడింది. అయితే, అధిక రిస్క్ ఉన్న ఖాతాదారులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేవైసీ అప్‌డేట్ చేయడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవైసీ అప్‌డేట్ ఇంట్లో కూర్చొని కూడా చేయవచ్చు. కేవైసీ అప్‌డేట్ ఆన్‌లైన్‌ ద్వారా చేయవచ్చు. అయితే కేవైసీ గురించి మీకు ఎవరైనా ఫోన్‌ చేసి వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + nine =