ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం, ఈ-కామర్స్‌ పోర్టల్స్ లో బుక్‌ చేసుకునే టికెట్లపై 5% జీఎస్టీ

2022 New Year celebration, City police impose restrictions on New Year’s Eve celebrations, Covid-19 scare, Mango News, New Year Celebraions, New Year Celebraions 2022, New Year Celebrations in Araku Valley, New Year Celebrations in Araku Valley Due to Covid-19 Effect, New Year’s Eve celebrations, No Permission For New Year Celebrations, Police Restricts New Year Celebrations in Araku, Police Restricts New Year Celebrations in Araku Valley, Police Restricts New Year Celebrations in Araku Valley Due to Covid-19 Effect

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు ఈ-కామర్స్‌ పోర్టల్స్ మరియు యాప్స్‌ ద్వారా బుక్‌ చేసుకునే ఏపీఎస్ఆర్టీసీ నాన్‌ ఏసీ టికెట్లపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

తాజానిర్ణయంతో రెడ్‌బస్, అభిబస్,పేటీఎం లేదా ఇతర ప్రైవేట్ పోర్టల్స్‌ మరియు యాప్స్ లో ఆర్టీసీ టికెట్స్ బుక్ చేసుకునే వారు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా జరిగే టికెట్ బుకింగ్ కు మరియు నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు ఈ జీఎస్టీ వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 8 =