సెప్టెంబర్ 5 నుంచి జియో ఫైబర్ సేవలు

gigafiber, jio, Jio Fiber Services, Jio Fiber Services to be launched, Jio Fiber Services to be launched from September 5, jio gigafiber, jio net, jio services, Mango News Telugu, Reliance Jio, Reliance Jio Fiber, Reliance Jio Fiber Services, Reliance Jio Fiber Services to be launched, Reliance Jio Fiber Services to be launched from September, Reliance Jio Fiber Services to be launched from September 5

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 5 నుంచి భారతదేశ వ్యాప్తంగా జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తునట్టు చెప్పారు. జియో ఫైబర్ సేవలకు టారిఫ్ రూ. 700 నుండి రూ. 10,000 వరకు ఉంటుందని చెప్పారు. దాదాపు 1600 నగరాల్లోని 2 కోట్ల నివాసాలు, 1.5 వాణిజ్య సముదాయాలకు జియో ఫైబర్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే కనెక్షన్ తో ల్యాండ్ లైన్, డీటీహెచ్, ఇంటర్నెట్ సేవలు పొందవచ్చని తెలిపారు. 2020 జనవరి 1 నుంచి జియో కమర్షియల్ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

జియో ఫైబర్ వివరాలు:

  • జియో ఫైబర్‌ ప్లాన్స్ ధరలు రూ.700-10,000ల మధ్య ఉంటాయి.
  • 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు స్పీడ్ ఉంటుంది
  • ల్యాండ్ లైన్ ఫోన్ , డీటీహెచ్ సెట్‌టాప్‌ బాక్స్ ఫ్రీగా ఇస్తారు
  • జియో ఫైబర్ ద్వారా దేశంలో ఏ నెటవర్క్ కి అయినా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు
  • రూ .500 ప్లాన్ తో వినియోగదారులు విదేశాలకు అపరిమిత కాలింగ్ చేయవచ్చు
  • 2020 మధ్యనుంచి జియో ఫస్ట్ డే ఫస్ట్ షో సేవలు అందుబాటులోకి తెస్తున్నారు, విడుదలైన రోజే ఇంటి నుంచి సినిమాలు చూసే అవకాశం
  • సెట్‌టాప్‌ బాక్స్ ద్వారా ఏ ప్రాంతానికైనా ఉచిత వీడియో కాల్స్ చేసుకునే అవకాశం
  • ప్రారంభ ఆఫర్ కింద ఎప్పటికి వార్షిక ప్లాన్స్ తీసుకునే జియో ఫైబర్‌ వినియోగదారులు హెచ్‌డీ/4కే ఎల్‌ఈడీ టీవీ మరియు సెట్‌టాప్‌ బాక్స్ ఉచితంగా పొందవచ్చు. 

 

[subscribe]
[youtube_video videoid=95Llx1I6slA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here