ఎగబాకుతున్న భూముల ధరలు, పుట్టుకొస్తున్న దుకాణాలు

Ayodhya as a Business Center, Business Center Ayodhya, Business Center, Rising Land Prices, Shops, Ayodhya, Lord Rama, Ayodhya Rama, Latest Ayodhya News, Ayodhya News Updates, Ayodhya News 2024, Modi, BJP, India, Mango News, Mango News Telugu
Ayodhya as a business center,Rising land prices, shops, Ayodhya ,Lord Rama, Ayodhya Rama

జనవరి 22న అయోధ్యలో శ్రీరామ చంద్రుని మందిర ప్రతిష్టాపన జరగనుండంతో.. అయోధ్య భవితవ్యం పూర్తిగా మారిపోబోతోంది.  రాబోయే కొద్ది నెలల్లో అయోధ్యకు ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ అంచనా వేస్తోంది.

దీంతో ఇలాంటి ప్రత్యేకమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా కంపెనీలు అప్పుడే రెడీ అయిపోయాయి. దీంతో అతి త్వరలోనే అయోధ్య వ్యాపార కేంద్రంగా మారిపోతోన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. ప్రముఖ ఆభరణాల  కంపెనీ అయిన కళ్యాణ్ జ్యువెలర్స్..జనవరి-మార్చి మధ్యలో అయోధ్యలో తన 250వ దుకాణాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

2024 సంవత్సరంలో..రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, కళ్యాణ్ జ్యువెలర్స్  భారత్‌తో పాటు పశ్చిమాసియాలో 30 కొత్త దుకాణాలను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది. వీటిలో భారతదేశంలో 15, పశ్చిమాసియాలో 2, 13 క్యాండీ షాపులను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 2023 డిసెంబర్  నాటికి..కళ్యాణ్ జ్యువెలర్స్ ఓవరాల్‌గా  235 గోల్డ్ షాపులను రన్  చేస్తుండగా.. తాజాగా  ఇప్పుడు తన 250వ బ్రాంచ్‌ను అయోధ్యలో ప్రారంభించబోతోంది.

మరోవైపు అయోధ్యలో ఓ వైపు రామ మందిర నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు  భూములు, ఆస్తుల ధరలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. భవిష్యత్తులో వీటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. అయోధ్యలో భూములపై  విదేశీ పెట్టుబడిదారులు, స్థానిక కొనుగోలుదారులు  ఎక్కువగా పెట్టుబడులు  పెడుతున్నారు. చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ..అయోధ్య నగరిపై ఫోకస్ పెంచాయి.

బిస్లరీ వంటి  కంపెనీలతో పాటు తాజ్, రాడిసన్ లాంటి పెద్ద హోటల్ చెయిన్లు కూడా అయోధ్యకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. కేవలం ఇవి మాత్రమే కాదు. హోటళ్లతో పాటు చాలా వ్యాపార సంస్ధలు అయోధ్యలో వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుందనే అంచనాలతో  కోట్ల పెట్టుబడి పెట్టడానికి వ్యాపారవేత్తలు రెడీ అవుతున్నారు. దీంతో రానున్న కాలంలో అయోధ్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 2 =