మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రామ్‌దేవ్, దుమారం రేగడంతో క్షమాపణలు

Yoga Guru Baba Ramdev Apologises Over His Remarks On Women Amid Sparked ,Yoga Guru Baba Ramdev,Baba Ramdev Yoga Guru,Yoga Baba Ramdev Apologises,Mango News,Mango News Telugu,Ramdev Baba Net Worth,Ramdev Baba Yoga Patanjali,Baba Ramdev Yoga Live Today,India Tv Live Yoga Today,India Tv Baba Ramdev Yesterday,Ramdev Baba Yoga Guru,Baba Ramdev Yoga On Tv,Swami Ramdev Yoga Programmes,Yoga Guru

యోగా గురు బాబా రామ్‌దేవ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. మహిళలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో ఆయన క్షమాపణలు తెలిపారు. మహారాష్ట్రలోని థానేలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన మహిళల వస్త్రధారణపై సరదాగా చేసిన వ్యాఖ్యలు చివరకు వివాదాస్పదమవయ్యాయి. తొలుత ఆయన మాట్లాడుతూ.. మహిళలు చీరలో, సల్వార్ సూట్స్‌లో చూడ చక్కగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మహిళలు అసలు ఏమీ ధరించకపోయినా కూడా అందంగా కనిపిస్తారు’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. మహిళా సంఘాలు బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర మహిళా కమిషన్, బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఈ వీడియోను షేర్ చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్, రామ్‌దేవ్ దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. దీంతో తాను చేసిన తప్పుని తెలుసుకున్న బాబా రామ్‌దేవ్ చివరకు మహిళలకు క్షమాపణలు చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా వారిని కించపరచలేదని, అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు వారిని బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. మహిళల సాధికారత కోసం మరియు సమాజంలో మహిళలు గౌరవప్రదంగా వెలుగొందడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని రామ్‌దేవ్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 4 =