దేశంలో త్వరలో 5G సేవలు, జియో‌లో‌ రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టనున్న గూగుల్

Google Investment in Jio Platforms, Mukesh Ambani, Mukesh Ambani Announced About 5G, Reliance Chief Mukesh Ambani, Reliance Industries Chairman Mukesh Ambani, RIL 43rd AGM, RIL AGM 2020, RIL AGM 2020 Live Updates, RIL AGM Highlights

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) జూలై 15, బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. జియో సొంతంగా 5జీ టెక్నాలజీని దేశంలోనే అభివృద్ధి చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది 5జీ కి సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయని, దేశంలో పరిశీలించిన అనంతరం ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ముకేశ్ అంబానీ వెల్లడించారు. జియో ప్లాట్‌ఫామ్‌లో 7.7 శాతం వాటా కోసం‌ రూ.33,737 కోట్లను గూగుల్ పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. గత ఏజీఎం సమావేశంలో ప్రకటించిన విధంగానే రిలయన్స్‌ సంస్థ నికర రుణ రహితంగా మారిందని చెప్పారు. రిలయన్స్‌లోకి ఇప్పటికే రూ.2.12 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని, అలాగే 150 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన మొదటి ఇండియన్ కంపెనీగా రిలయన్స్‌ అవతరించిందని ముకేశ్‌ అంబానీ చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =