ఇది మీకు తెలుసా? అందమైన వాళ్లే ఎక్కువ సంపాదనాపరులట..

Science Backed New Report Says That Physically Attractive People Really Make More Money,Science Backed New Report,New Report of Physically Attractive People,Attractive People Really Make More Money,Science Backed New Report of Attractive People,Mango News,Mango News Telugu,Do Pretty People Really Make More Money,Beautiful people are more earners,20-30 percent are high earners,Beautiful people,Science Backed New Report Latest News,Science Backed New Report Latest Updates,Attractive People Really Make Money Latest News

జనరల్‌గా కాస్త అందంగా ఉండే అమ్మాయి, అబ్బాయిలను చూస్తే.. చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అందమైన వారితో అవతలి వాళ్లు మాట్లాడే పద్ధతి, విధానం, చేసే పనులు కూడా ఆటోమేటిక్‌గా మారిపోతాయి. అయితే ఇదే పాయింట్ కెరీర్‌లోనూ కూడా పనికొస్తుందని చెబుతోంది 30 ఏళ్ల సుధీర్ఘ అధ్యయనం.

అవును నిజంగానే..ఇంటర్వ్యూలలో బ్యూటీనెస్, హ్యాండ్సమ్‌నెస్‌తో పాటు సబ్జెక్ట్ కూడా ఉన్నవారిని .. అందంగా లేని వారితో పోల్చితే.. అప్పుడు ఇంటర్వ్యూలో వీళ్లే ఎక్కువగా సెలక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఇప్పుడు.. అట్రాక్టివ్‌‌గా ఉండే పురుషులు.. తమ తోటి వారి కంటే 20-30 శాతం ఎక్కువగా సంపాదనాపరులుగా ఉండే చాన్స్ ఉందని చెబుతోంది ఈ స్టడీ.

అయితే దీనికి ఎప్పటి నుంచో ఉన్న ఒక అభిప్రాయం కూడా కారణం అయి ఉండొచ్చని అంటున్నారు నిపుణులు. అంటే ఒకరి ముఖం అందంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారనే అర్ధమని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇది వందల ఏళ్ల క్రితం నాటి మాటే అయినా.. ఇప్పటికీ జనాల మనుసుల్లో అంతర్లీనంగా ఉండిపోయిందని చెబుతున్నారు.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. కంపెనీ యజమానులు అనుభవం కంటే ఆకర్షణకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా కూడా.. ఇంటర్వ్యూలో స్కోర్ చేయడంలో ఎలా లేదన్న హ్యాండ్సమ్‌గా ఉండటం సహాయపడుతుంది. అలా సెలెక్ట్ అయినవారు ఉద్యోగులందరిలో కూడా మెరుగ్గా పని చేస్తారనే భావన కూడా ఉంటుంది. కాబట్టి నియామకం నుంచి చెల్లింపు ప్రక్రియ వరకు ఈ దశలన్నింటిలోనూ హ్యాండ్‌సమ్‌నెస్, బ్యూటీ అనేది సహయపడుతుంది.

అంతేకాదు.. బ్యాంకుల నుంచి ఇతర రుణాలు పొందేటప్పుడు కూడా అందంగా కనిపించే వ్యక్తులే మంచి ఒప్పందాలను పొందుతారట. ఈ సందర్భంగా నేషనల్ ఫుట్ బాల్ లీగ్‌పై స్టడీని ప్రస్తావించిన ఓ ఆర్థికవేత్త.. జట్లులో మెయిన్‌గా అందమైన వారికే ఎక్కువగా చెల్లించబడుతుందని, వారిపైన ఎక్కువ శ్రద్ధ చూపించే అవకాశం ఉంటుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =