విలీనానికి ముహూర్తం ఖరారు..! షర్మిల పోటీ అక్కడి నుంచే..!!

YS Sharmila Likely To Merge YSRTP in Congress Party Ahead of Telangana Assembly Elections,YS Sharmila Likely To Merge YSRTP,Merge YSRTP in Congress Party,Ahead of Telangana Assembly Elections,Telangana Assembly Elections,Mango News,Mango News Telugu,merger of YSRTP in Congress, two parties to this extent, YS Sharmila ,Congress,YS Sharmila Latest News,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,YSRTP Latest News,YSRTP Latest updates,YSRTP Live News

కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం ముహూర్తం ఖరారైంది. రెండు పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. కాంగ్రెస్‌లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం పూర్తయింది. షర్మిల కోరిక మేరకు తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వనుంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం సూచన మేరకు ఏపీలోనూ షర్మిల కీలక పాత్ర పోషించనున్నారు. సోనియాతో భేటీ ఆ వెంటనే పార్టీ విలీనం ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

వైఎస్సార్టీపీ ఇక కాంగ్రెస్‌లో విలీనం కానుంది. ఈ మేరకు దాదాపుగా అధికారిక నిర్ణయం జరిగింది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తి మంత్రాంగం నడిపారు. షర్మిల – కాంగ్రెస్ నాయకత్వం మధ్య మధ్యవర్తిత్వం వహించారు. ఫలితంగా షర్మిల కోరుకున్నట్లుగా తెలంగాణ నుంచి పోటీ…కాంగ్రెస్ కోరుతున్నట్లుగా ఏపీలోనూ బాధ్యతలకు షర్మిల అంగీకరించారు. ఫలితంగా ఈ నెల 12న షర్మిల ఢిల్లీలో సోనియాతో సమావేశం కానున్నారు. ఆ తరువాత రాహుల్‌తో భేటీ అయ్యేలా షెడ్యూల్ ఖరారైంది. దీంతో తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా సక్సెస్‌ అవ్వటంలో విఫలం అయ్యారు. ఫలితంగా పార్టీని విలీనం దిశగా నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారంపై కాంగ్రెస్ హైకమాండ్ పట్టుదలతో అడుగులు వేస్తోంది. ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదని భావిస్తోంది. అందులో భాగంగా షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. షర్మిల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. తొలుత పొత్తుల దిశగా చర్చలు జరిగినా, ఆ తరువాత విలీనం చేయాలంటూ కాంగ్రెస్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో తెలంగాణతో పాటుగా ఏపీలోనూ షర్మిల సేవలను వినియోగించుకొనేలా కాంగ్రెస్ ఒప్పించింది. కాంగ్రెస్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్‌గా షర్మిలను నియమిస్తూ.. పార్టీలోకి కీలక పదవి ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణలో పాలేరు నుంచి షర్మిల పోటీకి సిద్ధమయ్యారు. ఇందుకు తొలుత అంగీకరించిన కాంగ్రెస్, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పోటీకి సిద్ధం కావాలని సూచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

విలీనం వేళ సీటుపై కాంగ్రెస్ ఇచ్చిన ఈ ట్విస్టు పైన చర్చ సాగుతోంది. షర్మిలకు నేరుగా ఏఐసీసీలో పదవి ఇచ్చేలా నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. తెలంగాణలో షర్మిల పోటీ చేయటానికి టీపీసీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా.. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల్లోనే శక్తి మేర పని చేయాలని షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం సూచిస్తోంది. తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో ఏపీలో పని చేసేలా షర్మిలను ఒప్పించారు. అక్కడ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వైసీపీ ఓట్ బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా షర్మిల ప్రచారం చేయనున్నారు. దీంతో, కాంగ్రెస్‌లో విలీనం తరువాత ప్రధానంగా వైసీపీపై షర్మిల ఏ రకంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + one =