కాంగ్రెస్ పార్టీకి షాక్, సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ రాజీనామా

Senior Leader Punjab Ex-Congress Chief Sunil Jakhar Quits the Party, Senior Leader Sunil Jakhar Quits the Party, Punjab Ex-Congress Chief Sunil Jakhar Quits the Party, Good Luck and Goodbye Congress, Former Punjab Congress Chief Sunil Jakhar Quits Party, Sunil Jakhar Quits Party, Former Punjab Congress chief Sunil Jakhar quits Congress party, Former Punjab Congress president Sunil Jakhar said That he is quitting the party, Sunil Jakhar Senior Congress leader & former Punjab Congress chief, former Punjab Congress chief, Senior Congress leader, Ex-Congress Chief Sunil Jakhar, Sunil Jakhar, Senior Leader Sunil Jakhar News, Senior Leader Sunil Jakhar Latest News, Senior Leader Sunil Jakhar Latest Updates, Senior Leader Sunil Jakhar Live Updates, Mango News, Mango News Telugu,

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఫేస్‌బుక్ లైవ్ లో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలు మాత్రమే దక్కించుకుని అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ సీఎం చరణ్ జీత్ సింగ్ సన్నీపై విమర్శలు చేయడం, ఇతర అంశాలపై సునీల్ జాఖర్ మీద పలువురు నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెండేళ్ల పాటుగా అన్ని పదవుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సునీల్ జాఖర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఫేస్‌బుక్ లైవ్ లో మాట్లాడుతూ, కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్ లో పార్టీని నాశనం చేశారన్నారు. గుడ్ లక్ అండ్ గుడ్ బై కాంగ్రెస్ అని సునీల్ జాఖర్ పేర్కొన్నారు. ఓవైపు రాజస్థాన్‌లో మూడు రోజుల చింతన్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా సమావేశమైన క్రమంలో సునీల్ జాఖర్ రాజీనామా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here