ఫరూక్ అబ్దుల్లా కీలక నిర్ణయం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవీకి పోటీ చేయనని వెల్లడి

Senior Politician Farooq Abdullah Decides Not To Contest in Election for National Conference President,Farooq Abdullah,Senior Politician Farooq Abdullah,Farooq Decides Not To Contest in Election,National Conference President,Mango News,Mango News Telugu,Senior Politician Farooq Abdullah President,Farooq Abdullah National Conference President,Farooq Abdullah Latest News And Updates,Politician Farooq Abdullah,Politician Farooq Abdullah News And Live Updates

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 5వ తేదీన జరగనున్న జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ పార్టీ (జేఎన్కేసీ) పార్టీ అధ్యక్ష ఎన్నికలకు పోటీలో ఉండబోనని ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవీ నుంచి వైదొలగనున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లుగా శుక్రవారం ఉదయం వచ్చిన వార్తలను ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. “పార్టీకి ఇంకా నేనే సారథ్యం వహించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. నాకు ఇప్పుడు 86 ఏళ్లు. కొత్త తరం బాధ్యతలు తీసుకోవాలి. పార్టీ అధ్యక్ష పదవీకి పోటీ చేయను. పార్టీకి, ఎన్నికయ్యే కొత్త నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను. పార్టీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను” ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

కాగా ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా 1981, ఆగస్టు నుండి కొనసాగుతున్నారు. ఒక పర్యాయం అనగా 2002 నుండి 2006 వరకు మాత్రమే తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 2006లో ఫరూక్ అబ్దుల్లా తిరిగి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఈ క్రమంలోనే ఇకపై పార్టీ అధ్యక్షుడిగా ఉండనని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా వైదొలిగినప్పటికీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కు మళ్ళీ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్న ప్రాంతీయ పార్టీల సమ్మేళనం గుప్కార్ అలయన్స్ కు అధ్యక్షత వహించనున్నట్టుగా ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here