ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష, ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు

AP CM YS Jagan Held Review Meet on Women And Child Welfare Department Orders Officials To Fulfill Vacancies,CM Jagan's Review Of Ap Women And Child Welfare Department, Orders To Fill Vacancies,Orders Officials To Fulfill Vacancies,AP CM YS Jagan Mohan Reddy,Mango News,Mango News Telugu,Ap Women And Child Welfare Department,Women And Child Welfare Department,Women And Child Welfare Department News and Live Updates,Ap Child Welfare Department,Ap Women Welfare Department,Women Welfare Department,Andhra Pradesh Latest News And Updates,Andhra Pradesh News And Updates,Andhra Pradesh

అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు సంక్షేమ హాస్టళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో చేపట్టిన ఈ సమీక్షకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎస్ సమీర్ శర్మ సహా పలువురు సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు మరియు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కీలక సూచనలు, ఆదేశాలు..

  • రూ.3,364కోట్లతో హాస్టళ్లలో నాడు-నేడుకు గ్రీన్‌ సిగ్నల్‌. తొలివిడత హాస్టళ్లో నాడు-నేడుకు రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
  • జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు. అంగన్‌వాడీల్లో నాడు-నేడుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశం.
  • మొత్తం 3,013 చోట్ల నాడు-నేడు చేపట్టాలని, తొలివిడతలో 1366 చోట్ల నిర్వహించాలని సూచన.
  • అంగన్‌వాడీలు, సంక్షేమ హాస్టళ్లలో కనీస అవసరాల కోసం 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలని ఆదేశం.
  • ఈ విభాగాల్లో ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది సంరక్షకుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశం.
  • అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారులను నియమించాలని సూచన.
  • డిసెంబర్ 1నుంచి అంగన్‌వాడీలలో విద్యార్థులకు ఫ్లేవర్డ్ మిల్క్ అందిస్తామని తెలిపిన అధికారులతో మూడు నెలల్లోగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం ఆదేశం.
  • పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్-4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి.
  • అంగన్‌వాడీ కేంద్రాల్లో పీరుదులు స్వీకరించడానికి ప్రత్యేక నంబర్ ఉంచాలని సూచన.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here