రూ.6,210 కోట్ల విలువైన ఆస్తులను ఉద్యోగులకు రాసిచ్చేసిన యజమాని

Shriram Group Founder R Thyagarajan Donated Assets Worth Rs 6210 Cr To Employees,Shriram Group Founder R Thyagaraja,Thyagarajan Donated Assets Worth Rs 6210 Cr,Shriram Group Founder Donated Assets To Employees,Shriram Group Founder,Mango News,Mango News Telugu,field of finance, Shriram Group, The founder of the group,Thyagarajan, Thyagarajan donating all his assets to company employees,Shriram Group Founder Latest News,Shriram Group Founder Latest Updates,Founder Thyagarajan Latest News,Founder Thyagarajan Latest Updates

ఫైనాన్స్ రంగంపై అవగాహన ఉన్న వారికి శ్రీరామ్ గ్రూప్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆ గ్రూపు వ్యవస్థాపకుడు ఆర్. త్యాగరాజన్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.. తాజాగా ఆయన తన ఆస్తులన్నీ కంపెనీ ఉద్యోగులకు దానం చేయడం ద్వారా, సమకాలీన భారతదేశంలో గొప్ప దాతగా పేరు సంపాదించారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

ఆర్. త్యాగరాజన్ శ్రీరామ్ ఫైనాన్స్‌ను స్థాపించడం ద్వారా వేలాది మంది ఆర్థికంగా నిస్సహాయులైన వారికి సహాయం చేశారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఈ శ్రీ రామ్ ఫైనాన్స్ గ్రూప్ నేడు 1 లక్షా 8 వేల మంది ఉద్యోగులకు జీవనోపాధిని కల్పించింది. ట్రక్కులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న వారికి రుణాలు ఇవ్వడం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఎంతో సహాయం చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా సమాజంలోని అణగారిన వర్గానికి ఏదైనా చేయాలనుకున్న త్యాగరాజన్ తన రూ. 6210 కోట్ల విలువైన ఆస్తులను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు.

తమిళనాడులోని ధనిక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి గణితశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. తరువాత, అయన 1961లో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో చేరారు. తరువాతి వివిధ ఆర్థిక సంస్థలలో పనిచేశారు. ఆయన 37 సంవత్సరాల వయస్సులో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు శ్రీరామ్ గ్రూప్ కింద 30 కంపెనీలకు అధిపతిగా ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఆయన సాధారణ కారులో ప్రయాణిస్తూ, ఒక చిన్న ఇంట్లో ఉంటారు. ఈ రోజుకు ఆయన వద్ద మొబైల్ ఫోన్ లేదని, మొబైల్ ఫోన్ వల్ల టార్గెట్ మిస్ అవుతుందని కూడా నమ్ముతున్నారు.

ప్రస్తుతం శ్రీరాం గ్రూపు కంపెనీలకు 23 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. జూన్ త్రైమాసికంలో దాని లాభం దాదాపు 200 మిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగులకు మంచి వేతనం చెల్లించే ఆయన తాజాగా తన వాటాలన్నింటినీ ఉద్యోగుల సంఘానికి ఇవ్వడం ద్వారా సంచలనంగా మారారు. శాస్త్రీయ సంగీత ప్రియుడైన త్యాగరాజన్, శ్రీరామ్ ఓనర్‌షిప్ ట్రస్ట్‌కు ఈ మొత్తాన్ని బదిలీ చేశారు.

కొందరు కొంచెం ధనవంతులైతే, మరింత ధనవంతులు కావాలనే వ్యామోహం కలిగి ఉంటారు. సమాజం గురించి ఆలోచించకుండా డబ్బు వెనుక పడిపోతారు. కానీ త్యాగరాజన్ సంపన్నుడిగా జన్మించినప్పటికీ, సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషిని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =