ఎన్నికల ముందు కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా?

CM KCR Likely To Introduce New Schemes Ahead of Telangana Assembly Elections,CM KCR Likely To Introduce New Schemes,Schemes Ahead of Telangana Assembly Elections,Telangana Assembly Elections,Mango News,Mango News Telugu,KCRs Forecast For Telangana Assembly Elections,KCRs master plan, before the elections, CM KCR, Telengana Elections, Assembly Elections, Free Schemes,CM KCR Latest News,CM KCR Latest Updates,CM KCR News And Live Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

రాజకీయం ఎలా చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. ఓటర్లను ఎలా ట్యూన్ చేయాలో ఆయనకు ఇంకా బాగా తెలుసని రాజకీయవర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. కేసీఆర్ ఇప్పుడు స్కీములతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు పథకాలనే ఆధారంగా చేసుకుంటున్నారు. అయితే అవి అమలు చేస్తున్న పథకాలు కాదు.. అమలు చేయబోయే పథకాలు. వరుసగా పథకాలను ప్రకటించడం.. దరఖాస్తులు తీసుకోవడం ప్రస్తుతం కామన్‌గా మారిపోయింది. అన్నీ లక్షలు ఇచ్చే పథకాలే, అవి కూడా ఉచితంగా.. అందుకే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అన్నింటినీ కాదనుకుండా తీసుకుంటోంది ప్రభుత్వం. స్థలం ఉండి ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షలు ఇచ్చే గృహలక్ష్మి పథకాన్ని గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ ఎన్నికలకు ముందు దరఖాస్తులు తీసుకున్నారు. ఏకంగా పదిహేడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకూ దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు సహా అనేక పథకాల అప్లికేషన్లు తీసుకున్నారు. ఇక డబుల్ బెడ్ రూం ఇళ్ల అప్లికేషన్ల గురించి చెప్పాల్సిన పని లేదు.

ఇక కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు పూర్తిగా ఉచితమే. దళిత బంధు కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారు. అది పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా లబ్ధిదారు వెనక్కి కట్టాల్సిన పని లేదు. అలాగే బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా. ఒక్కో కుటుంబానికి లక్ష ఇస్తారు. అది కూడా అప్పు కాదు. గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు ఇస్తారు. అంతా ఉచితమే. ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేసుకున్న ఎవరికైనా ఆశ మిణుకు మిణుకు అంటూ ఉంటుంది. ఆ డబ్బులు వస్తే.. అనే ఊహే వారిని గాల్లో విహరింప చేస్తుంది. కానీ అందరికీ ఎన్నికల్లోపు ఇవ్వడం సాధ్యం కాదు. ప్రతి నెలా కొంత మందికి ఇస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. ఇప్పటికే పథకాలు పంపిణీ ప్రారంభించారు. నియోజకవర్గానికి వంద నుంచి వెయ్యి మంది వరకూ ఎంపిక చేసి ఇస్తున్నారు. ప్రతీ నెలా ఇస్తారు..ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉన్నాయి. అంటే.. ఇంకా 90 శాతానికిపైగా మిగిలిపోతారు. మీకేం భయం వద్ద మన సర్కార్‌కు ఓటేయండి.. ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామంటారు. అప్లికేషన్ ప్రభుత్వం వద్ద పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందే. ఇదే కేసీఆర్ మాస్టర్ ప్లాన్.

మరోవైపు పథకాల లబ్ధిదారులు ఎంతో ఆశగా ఉంటారు. కొంతమందికి ఇచ్చి తమకు ఇవ్వలేదని.. ఎన్నికల తర్వాత ఇస్తారన్న నమ్మకం లేకపోతే.. వారు రివర్స్ అవుతారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. హైదరాబాద్‌లో భారీ వరదలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి పది వేలు ఇస్తామన్నారు. ఇవ్వకుండానే గ్రేటర్ ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు అవగానే ఇస్తామన్నారు. కానీ.. ప్రజలు నమ్మలేదు. భారీగా వరదలు వచ్చిన చోట బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఇలాంటి అపనమ్మకం రిపీటైతే.. పూర్తిగా అంచనాలు తలకిందులు అవుతాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − ten =