ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ కీలక ప్రకటన.. ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్‌ నియామకం

Social Media Giant Meta Platforms Appoints Sandhya Devanathan as New India Head After Ajit Mohan,Meta Platforms,Meta Facebook,Meta CEO Sandhya Devanathan,Mango News,Mango News Telugu,Meta Former Head Ajit Mohan,Meta New CEO Sandhya Devanathan,Meta CEO Sandhya Devanathan,CEO Sandhya Devanathan,Meta CEO Latest News And Updates,Social Media Giant Meta,Meta Platforms Appoints Sandhya Devanathan,Sandhya Devanathan,Meta New India Head Sandhya Devanathan,Meta Latest News And Updates

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘మెటా’ కీలక ప్రకటన చేసింది. ఇండియా నూతన ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమించినట్లు కంపెనీ గురువారం తెలిపింది. అయితే ఆసియా పసిఫిక్ మార్కెట్ కోసం కంపెనీ గేమింగ్ వర్టికల్‌కు నాయకత్వం వహిస్తున్న దేవనాథన్, జనవరి 1, 2023 నుంచి ఇండియా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత మెటా ఇండియా కంట్రీ హెడ్ అజిత్ మోహన్ నిష్క్రమణ తర్వాత ఈ నియామకం జరిగింది. ఆయన మెటా ప్రత్యర్థి ‘స్నాప్‌’లో చేరనుండటం విశేషం. కాగా ఆయనతో పాటు మంగళవారం వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ మరియు మెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా కంపెనీని విడిచిపెట్టడం గమనార్హం. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఇండియా (మెటా) డైరెక్టర్ మరియు భాగస్వామ్య హెడ్ మనీష్ చోప్రా ప్రస్తుతం కంపెనీకి తాత్కాలిక ప్రాతిపదికన నాయకత్వం వహిస్తున్నారు.

కాగా సంధ్యకు ఈ రంగంలో మొత్తం 22 సంవత్సరాల అనుభవం ఉంది. 2000 సంవత్సరంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫాకల్టీ మేనేజ్‌మెంట్‌లో పట్టా అందుకున్నారు. సంధ్యకు బ్యాంకింగ్, చెల్లింపులు మరియు సాంకేతికతలో మంచి పట్టుంది. ఆమె 2016లో మెటాలో చేరగా.. సింగపూర్ మరియు వియత్నాం దేశాలలో కంపెనీ వ్యాపార పరంగా నిలదొక్కుకోవడంలో, అలాగే ఆగ్నేయాసియాలో తమ ఈకామర్స్ కార్యక్రమాలను నిర్మించడంలో అద్భుత సహకారం అందించారు. కాగా ఇటీవలే మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ నుంచి 11,000 మందిని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ముఖ్య స్థానాలలో ఉన్నవారు కూడా స్వచ్చందంగా కంపెనీని వీడుతున్నారు. దీంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తున్నారు.

ఈ సందర్భంగా మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ దీనిపై స్పందిస్తూ.. ‘భారతదేశానికి మా కొత్త నాయకురాలుగా సంధ్యను స్వాగతిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సంధ్య వ్యాపారాలను స్కేలింగ్ చేయడం, అసాధారణమైన మరియు కలుపుకొని ఉన్న బృందాలను నిర్మించడం, ఉత్పత్తి ఆవిష్కరణలను నడపడం మరియు బలమైన భాగస్వామ్యాలను నిర్మించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. భారతదేశంలో మెటా యొక్క నిరంతర వృద్ధికి ఆమె నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆమె నియామకం భారతదేశంలోని కీలక ఛానెల్‌లలో మెటా ఆదాయ వృద్ధిని పెంచడానికి దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లు, సృష్టికర్తలు, ప్రకటనదారులు మరియు భాగస్వాములతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తుంది’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =