కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 10 రంగాలకు 1,45,980 కోట్ల ప్రోత్సాహకాలు

Cabinet approves, Cabinet approves PLI scheme, Cabinet approves PLI scheme for 10 sectors, Cabinet approves production linked incentive scheme, Mango News elugu, national news, PLI Scheme, production linked incentive scheme, Solar PV, Union Cabinet, Union Cabinet Approves PLI Scheme

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • 10 కీలక రంగాల మెరుగుదల కోసం పీఎల్‌ఐ పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. భారతదేశం యొక్క ఉత్పాదక సామర్థ్యాలు మరియు ఎగుమతులను మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, ఎలక్ట్రోనిక్/టెక్నాలజీ ప్రొడక్ట్స్, ఆటో మొబైల్స్ అండ్ ఆటో కంపోనెంట్స్, ఫార్మా, టెలికం అండ్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్, టెక్స్ట్ టైల్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, సోలార్‌ ఫోటోవోల్టిక్‌, వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడి), స్పెషలిటీ స్టీల్ వంటి పది రంగాలకు 5 సంవత్సరాల పీరియడ్ లో రూ.1,45,980 కోట్ల విలువైన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలకు వర్తింపచేసినట్టు తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ రంగం గరిష్టంగా 57,042 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకుంది.
  • మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఫండింగ్ (విజిఎఫ్) కింద ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాల (పీపీపీ) పథకాలకు మరింత ఆర్ధిక సాయం, ఊతమిచ్చేందుకు 2024-25 వరకు రూ.8100 కోట్ల రూపాయల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్టు మంత్రి వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =