మహారాష్ట్ర: అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం, మద్దతుగా 164 ఎమ్మెల్యేలు

Maharashtra CM Eknath Shinde Wins Trust Vote at Assembly by a 164-99 Margin, Eknath Shinde Wins Trust Vote at Assembly by a 164-99 Margin, 164-99 Margin, New Maharashtra CM Eknath Shinde Secures Big Win As Proves Majority In Floor Test, Maharashtra CM Eknath Shinde Secures Big Win As Proves Majority In Floor Test, CM Eknath Shinde Secures Big Win As Proves Majority In Floor Test, Eknath Shinde Secures Big Win As Proves Majority In Floor Test, Eknath Shinde Proves Majority In Floor Test, Majority In Floor Test, floor test was held in the Assembly, Maharashtra Assembly floor test, Maharashtra Assembly, New Maharashtra CM Eknath Shinde, Maharashtra CM Eknath Shinde, CM Eknath Shinde, Eknath Shinde, Floor Test, Maharashtra Assembly floor test News, Maharashtra Assembly floor test Latest News, Maharashtra Assembly floor test Latest Updates, Maharashtra Assembly floor test Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్ర రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ జూన్ 30న ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు అసెంబ్లీలో నిర్వహించిన కీలకమైన బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా, మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145 కాగా, బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి 164 ఓట్లు వచ్చాయి. హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించగా, 164 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడడంతో బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం గెలుపొందినట్లు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. ఇక షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు రాగా, ముగ్గురు సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు..

ముందుగా గవర్నర్‌ ఆదేశాల మేరకు రెండు రోజుల జరిగే మహారాష్ట్ర ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జూలై 3, ఆదివారం నాడు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో ముందుగా స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. స్పీకర్ పదవీకి ప్రభుత్వం నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నుంచి శివసేన ఎమ్మెల్యే రాజన్ సల్వి నామినేషన్స్ దాఖలు చేయగా, ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రాహుల్ నార్వేకర్ కు 164 ఓట్లు రాగా, రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి.

మరోవైపు కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిర్ణయాలపై ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్షనేతగా ఉన్న అజయ్ చౌదరిని తొలగిస్తూ, ఏక్‌నాథ్ షిండేను మళ్ళీ శివసేన శాసనసభా పక్షనేతగా స్పీకర్​ నియమించారు. అలాగే శివసేన పార్టీ చీఫ్​ విప్​గా ఉన్న ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన సునీల్​ ప్రభును తొలగించి, భరత్​ గోగావలేను స్పీకర్ నియమించారు. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ కు విప్‌ లను గుర్తించే అధికారం లేదని, ఈ నిర్ణయాలపై సమీక్షించాలని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 7 =