కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడులో తాజా ఆంక్షలు, థియేటర్లు 50 శాతంతో అనుమతి

Coronavirus in Tamil Nadu, Mango News, Tamil Nadu, Tamil Nadu Corona Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu Coronavirus News, Tamil Nadu Coronavirus Updates, Tamil nadu covid restrictions, Tamil Nadu Covid-19 Cases, Tamil Nadu imposes fresh COVID-19 restrictions, Tamilnadu Govt, TamilNadu Govt Issues Fresh Restrictions, Theatres Allowed with 50 Percent Seating Capacity, TN announces stricter COVID curbs from April 10

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలను ప్రకటించింది. ఏప్రిల్ 10 నుండి థియేటర్లు, మల్టిఫ్లెక్సులు 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతోనే నడపాలని ఆదేశాలు ఇచ్చారు. థియేటర్లలో ప్రభుత్వం ప్రకటించిన అన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. అలాగే షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాల్లో గరిష్టంగా 50 శాతం మాత్రమే అనుమతించాలని చెప్పారు. ఆలయ ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలను నిషేధించారు. కోయంబేడు మార్కెట్ లో ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెట్లపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

ఇక బస్సుల్లో నిలబడి ప్రయాణించేలా ప్రయాణీకులను అనుమతించబోమని అన్నారు. టీ షాపులు మరియు రెస్టారెంట్లలో 50 శాతం సామర్థ్యంతో రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. మతపరమైన ప్రదేశాల్లో నిబంధనలకు అనుగుణంగా రాత్రి 8 గంటలవరకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఫిల్మ్/టీవీ షూట్స్ కు అనుమతి ఉంటుందని, అయితే నిర్మాణ సంస్థలు షూటింగ్ లో పాల్గొనే ఆర్టిస్ట్స్, సిబ్బందికి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించడం లేదా వాక్సిన్ తీసుకునేలా చూడాలని చెప్పారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు 9,11,110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,70,546 మంది కరోనా నుంచి కోలుకోగా, 12,821 మంది మరణించారు. ప్రస్తుతం 27,743 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =