మాస్క్‌లు ధరించండి, ప్రికాష‌న్ డోసు తీసుకోండి – చైనాలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం కీలక సూచనలు

Centre Advises Wear Masks in Crowded Places and Get Precaution Doses Amid Covid Surge in China,Wear Masks,Take Precautionary Dose,Covid Outbreak in China,Centre's Key Advice,Mango News,Mango News Telugu,COVID-19,Covid Epidemiology,Covid virology,Covid prevention,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

చైనాలో కోవిడ్-19 మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని నెలలుగా అవలంబిస్తున్న ‘జీరో-కోవిడ్’ విధానాన్ని ఎత్తివేసిన తర్వాత ఆ దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి రోజు వందలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సూఖ్ మాండ‌వీయ నేతృత్వంలో ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వీకే పాల్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా ఈ మీటింగ్‌లో పాల్గొన్న అధికారులు అంద‌రూ మాస్క్‌లు ధ‌రించారు. సమావేశంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన ప్రమాణాలు వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు.

ఇక మీటింగ్ అనంతరం మంత్రి మన్సూఖ్ మాండ‌వీయ ట్వీట్ చేశారు. కోవిడ్ ఇంకా ముగిసిపోలేద‌ని, అంద‌రూ అల‌ర్ట్‌గా ఉండాల‌ని, నిఘా పెంచాల‌ని ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు. ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు మాస్క్‌లు ధ‌రించాల‌ని సూచించారు. ఈ సందర్భంగా ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. ఇక సమావేశం అనంతరం వీకే పాల్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ‌వ్యాప్తంగా ప్రికాష‌న్ డోసు తీసుకున్న వారి సంఖ్య 27 నుంచి 28 శాతం మాత్రమే ఉంటుంద‌ని, ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఈ డోసు తీసుకోవాల‌ని ఆయన సూచించారు. అలాగే దేశంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికోసం ర‌ద్దీ ఎక్కువగా ఉండే ప్ర‌దేశాల్లో ఉంటే అప్పుడు క‌చ్చితంగా మాస్క్‌లు ధ‌రించాల‌ని పాల్ పౌరులకు సూచించారు. వ‌య‌సు ఎక్కువ‌గా ఉన్న వారు, అలాగే ఏవైనా రుగ్మ‌తులు ఉన్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్‌లు ధ‌రించాల‌ని స్పష్టం చేశారు. కాగా కోవిడ్ నిర్మూల‌న కోసం మూడ‌వ డోసు రూపంలో ప్రికాష‌న్ డోసును కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న విష‌యం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =