రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌ కు తీవ్ర గాయాలు

Teamindia Cricketer Rishabh Pant Hospitalised with Serious Injuries after Car Mishap,Rishabh Pant Accident,Rishabh Pant Accident News,Rishabh Pant Car Accident,Rishabh Pant Today News,Rishabh Pant Today News Car Accident,Mango News,Mango News Telugu,Rishabh Pant Age,Rishabh Pant And Urvashi Rautela,Rishabh Pant Century,Rishabh Pant Height,Rishabh Pant Net Worth,Rishabh Pant News,Rishabh Pant Stats,Rishabh Pant Twitter,Rishabh Pant Urvashi,Rishabh Pant Wikipedia,

టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్‌ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి రూర్కీకి తిరిగి వెళ్తుండగా రూర్కీ నర్సన్ సరిహద్దులో రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్‌ తీవ్రంగా గాయపడగా, అతడికి ముందుగా రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంత్ కు వీపు, నుదురు మీద, కాలికి గాయాలయ్యాయి . కారులో మంటలు చెలరేగుతున్న సమయంలో కారు విండో పగలగొట్టుకుని రిషభ్ పంత్ బయటకు దూకినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలంలో దృశ్యాలు చూస్తే కారు పూర్తిగా దగ్ధమైన స్థితిలో ఉంది.

క్రికెటర్ రిషబ్ పంత్ కారు హరిద్వార్ జిల్లాలోని మంగళూర్ మరియు నర్సన్ మధ్య ప్రమాదానికి గురైందని, ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్‌ కారులో పంత్ ఒక్కడే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మంగ్లౌర్ పీఎస్ ఏరియాలోని నేషనల్ హైవే-58లో జరిగిన ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముందుగా పంత్‌ను రూర్కీలోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్టు హరిద్వార్ రూరల్ ఎస్పీ తెలిపారు. కాగా ప్రస్తుతం రిషభ్ పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. పంత్ కు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్స్ పెడుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =