ఫుట్‌బాల్‌ దిగ్గజం, లెజెండరీ ప్లేయర్ పీలే కన్నుమూత

Brazilian Football Legend Pele Passed Away at the Age of 82,Soccer player Pelé died,Brazil Football Players Legends,Brazil Legendary Football Players,Mango News,Brazil World Cup Wins,Brazilian Legend Football Players,Cancer De Pele,Greatest Soccer Player Of All Time,Is Pelé Alive,Murio Pele,Pelé 2022 Age,Pelé Children,Pele Condition,Pele Dead,Pele Dying,Pele Goals,Pele In Hospital,Pele Movie,Pele Net Worth,Pele News,Pele Soccer,Pele Stats,Brazilian legend Pelé died

ఫుట్‌బాల్‌ దిగ్గజం, లెజెండరీ ప్లేయర్ పీలే (82) కన్నుమూశారు. బ్రెజిలియన్ ఫుట్‌బాల్ లెజెండ్ పీలే మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాకర్ అభిమానులు విషాదంలో మునిగారు. గత కొంతకాలంగా పీలే క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సావోపాలోలోని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పీలే తుదిశ్వాస విడిచారు. పీలే మరణాన్ని అతని ఏజెంట్ జో ఫ్రాగా ధ్రువీకరించారు. బ్రెజిల్ కు చెందిన ఎడ్సన్ అరంటెస్ డో నాస్సిమెంటో ప్రపంచ ఫుట్‌బాల్‌ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా ఎదిగి పీలేగా ఖ్యాతి గాంచారు.

“ఈ రోజు శాంతియుతంగా కన్నుమూసిన కింగ్ పీలే యొక్క ప్రయాణంలో స్ఫూర్తి మరియు ప్రేమ గుర్తించబడ్డాయి. తన ప్రయాణంలో, ఎడ్సన్ తన క్రీడలో గొప్పగా రాణించి ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసాడు, ఒక యుద్ధాన్ని ఆపివేసాడు, ప్రపంచవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు మరియు మన సమస్యలన్నింటికీ మందు అని అతను ఎక్కువగా నమ్మిన ప్రేమను వ్యాప్తి చేశాడు. ఈరోజు ఆయన సందేశం భవిష్యత్ తరాలకు వారసత్వం అవుతుంది. ప్రేమ, ప్రేమ మరియు ప్రేమ, ఎప్పటికీ” అంటూ పీలే మరణం అనంతరం పీలే ఇన్స్టాగ్రామ్ లో కుటుంబసభ్యులు పోస్ట్ చేశారు.

1940, అక్టోబర్‌ 23న బ్రెజిల్ లో పీలే జన్మించారు. ఆల్ టైమ్ సాకర్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఒకరిగా పీలే పేరుపొందగా, ఫిఫా చేత గ్రేటెస్ట్ గా గుర్తించబడ్డాడు. తన అద్భుత, మంత్రముగ్ధ ఆటతీరుతో సాకర్‌ లో రాణించి 20వ శతాబ్దపు అత్యంత విజయవంతమైన క్రీడాకారులలో ఒకరిగా పీలే నిలిచాడు. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ఫిఫా ప్రపంచకప్‌ లు సాధించడంలో సాధించడంలో పీలే కీలక పాత్ర పోషించాడు. మూడు ప్రపంచకప్‌లు అందుకున్న ఏకైక సాకర్ ప్లేయర్ గా పీలే గుర్తింపు పొందాడు. మొత్తం అన్నిరకాల 1,366 మ్యాచ్ లలో 1,281 గోల్స్ చేయడం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌గా గుర్తించబడింది.

పీలే 15 సంవత్సరాల వయస్సులో శాంటోస్ కు మరియు 16 సంవత్సరాల వయస్సులో బ్రెజిల్ జాతీయ జట్టులో ఆడటం ప్రారంభించి అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బ్రెజిల్ తరపున 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్‌ చేసి, అత్యధిక గోల్స్‌ చేసిన వ్యక్తిగా ముందుగా పీలే నిలిచాడు. బ్రెజిల్ ఆటగాడు నెయ్‌మార్‌ కూడా 77 గోల్స్‌తో పీలేను సమం చేశాడు. ఇక బ్రెజిలియన్‌ క్లబ్‌ శాంటోస్‌ తరఫున ఆడిన పీలే 659 మ్యాచ్‌ల్లో 643 గోల్స్‌ చేసి ఆల్ టైమ్ గోల్ స్కోరర్ గా ఉన్నాడు. పీలే 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీచే శతాబ్దపు అథ్లెట్‌గా ఎంపికయ్యాడు, అలాగే 20వ శతాబ్దానికి చెందిన టైమ్ లిస్ట్‌లో 100 మంది అత్యంత ముఖ్యమైన వ్యక్తుల జాబితాలో నిలిచాడు. ఇక 2000 సంవత్సరంలో అర్జెంటీనా సాకర్ దిగ్గజం డిగో మారడోనాతో కలిపి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ అవార్డును కూడా పీలే అందుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 7 =