టెట్ క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు 7 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు పెంపు

Mango News, Teachers Eligibility Test, Teachers Eligibility Test qualifying certificate, TET Qualifying Certificate, TET qualifying certificate valid for lifetime, TET Qualifying Certificate Validity, TET Qualifying Certificate Validity Period, TET Qualifying Certificate Validity Period Extended, TET Qualifying Certificate Validity Period Extended from 7 Years to Lifetime, TET validity latest news

టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ అర్హత సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని 7 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం నాడు ప్రకటించారు. 2011 నుంచి టెట్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ ఆదేశాలు వర్తించనున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలితప్రాంతాలు 7 సంవత్సరాల కాలం గడిచిన అభ్యర్థులకు తిరిగి రీ వ్యాలిడేట్ చేయడం లేదా కొత్త టెట్ సర్టిఫికెట్లను ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముందుగా పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేందుకు టెట్ పరీక్షలో అర్హత సాదించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. టెట్ పరీక్షను రాష్ట్రప్రభుత్వాలు నిర్వహిస్తుండగా, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిటిఇ) 2011 నాటి మార్గదర్శకాలు ప్రకారం టెట్ సర్టిఫికెట్ చెల్లుబాటును, ఉత్తీర్ణత తేదీ నుండి 7 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ ఏడు సంవత్సరాల్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించలేని అభ్యర్థులు, మరోసారి టెట్ రాసి అర్హత పొందాల్సి ఉండేది. అయితే తాజాగా కేంద్రం టెట్ సర్టిఫికెట్ చెల్లుబాటును జీవితకాలంకు పెంచడంతో ఒకసారి టెట్‌ లో ఉత్తీర్ణత సాధిస్తే, ఎప్పటికి చెల్లుబాటు కానుంది. ఉపాధ్యాయ వృత్తిని కోరుకునే అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను పెంచడంలో ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =