దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌

The most powerful electric locomotive in the country,The most powerful electric locomotive,electric locomotive in the country,electric locomotive,Make in India, WAG 12 B, HP,Modernization of rails,Indian Railways, WAG 12B Train Specialties, electric locomotive in the country,Mango News,Mango News Telugu,Modernization of rails News Today,Modernization of rails Latest News,Modernization of rails Latest Updates,Indian Railways Latest News,Indian Railways Latest Updates
Make in India, WAG 12 B, HP,Modernization of rails,Indian Railways, WAG 12B Train Specialties, electric locomotive in the country

భారత ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి, వినియోగం పెరిగేలా ‘మేక్ ఇన్ ఇండియా’  అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలో స్వదేశీ టెక్నాలజీ విప్లవానికి.. మేకిన్ ఇండియా కార్యక్రమం కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో.. అప్పట్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఇండియన్ రైల్వేస్  డెవల్మపెంట్‌లో  ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

చాలా దేశాలు తమ రైల్వే సిస్టమ్స్‌ను ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్స్, పట్టాల ఆధునీకరణ, రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఇండియన్ రైల్వేస్‌ను డెవల్ప్మెంట్ బాటలో నడిపించడానికి చర్యలు తీసుకుంటోంది. ట్రాక్‌ల విద్యుదీకరణ, డబుల్ లైన్స్, వేగంగా వెళ్లే కొత్త ట్రైన్స్2ను అందుబాటులోకి తీసుకురావడం వంటి పనులు కూడా చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా  అంతకు మంచి అన్నట్లుగా.. త్వరలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను పట్టాలపైకి ఎక్కించబోతోంది.

ఇది హెవీ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్  రైళ్లను చాలా వేగంతో.. చాలా అలవోకగా ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ లాగుతుంది.  ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌కు సంబంధించిన వీడియోను  తాజాగా ‘బీస్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్’ పేరుతో భారత రైల్వే శాఖ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది. వాగ్ 12 బీ అనే ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ హైలెట్స్‌ను వివరిస్తూ రైల్వే శాఖ ఈ వీడియోను షేర్ చేసింది. ఇది హెవీ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్  ట్రైన్స్‌ను చాలా  వేగంతో లాగగలిగే కెపాసిటీ ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత రైల్వే ‘వాగ్ 12 బీ’ను రూపొందించునుంది.

ఇండియన్ రైల్వే బీస్ట్ వాగ్ 12బీకి చాలా ప్రత్యేకతలున్నాయి. వాగ్12బీ అనేది 12,000 హార్స్‌పవర్  ఎలక్ట్రిక్ లోకోమోటివ్. ఆ లెక్కన ఇది వాగ్-9 కంటే రెండు రెట్లు శక్తివంతమైనది. ఇది గరిష్టంగా 120 కేఎంపీహెచ్ వేగంతో 6,000 టన్నుల బరువును ఈజీగా లాగుతుంది. 22.5 టన్నుల యాక్సిల్ లోడ్‌తో బోబో డిజైన్‌తో ఇది రాబోతుంది. దీన్ని భవిష్యత్‌లో 25 టన్నులకు అప్‌గ్రేడ్ చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ ఆధారిత ప్రొపల్షన్ టెక్నాలజీ ఈ లోకోమోటివ్‌లో కీలకం కాబోతోంది. టెక్నాలజీతో గూడ్స్ రైలు సాఫీగా,స్పీడుగా వెళ్లడంలో కీ రోల్  పోషిస్తుంది. ఈ టెక్నాలజీ అద్భుతమైన బ్రేకింగ్‌ను కలిగి ఉండటంతో.. విద్యుత్ బాగా ఆదా అవడమే కాకుండా.. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది.

ఇండియన్ రైల్వే బీస్ట్ వాగ్ 12బీ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. వాగ్ 12 బీ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వల్ల.. సరకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని కనీసం 20-25 కేఎంపీహెచ్ వరకు పెంచుతుందని ఇండియన్ రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల సరకు రవాణా యాక్టివిటీస్ కెపాసిటీతో పాటు.. భద్రత కూడా మెరుగుపడుతుంది. భారత్‌లో సరకు రవాణాను పెంచడానికి అభివృద్ధి చేస్తున్న ‘డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్’ కనెక్టివిటీ, సామర్థ్యాన్ని కూడా వాగ్ 12బీ పెంచుతుంది. ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా వ్యూహాత్మక ఉపయోగం కోసం వాగ్ 12 బీని జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − sixteen =