ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ఇదే..

The Most Powerful Passports in The World For 2023 Revealed Check Here,The Most Powerful Passports,Powerful Passports in The World For 2023,Most Powerful Passports Revealed,Most Powerful Passports Check Here,Mango News,Mango News Telugu,Passport ranking 2023,Powerful Passport, Most powerful passport in the world,Visa Free, Visa on Arrival Access, Visa Score,Most Powerful Passports News Today,Most Powerful Passports Latest News,Most Powerful Passports Latest Updates

జనరల్‌గా భారత దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే..ప్లైట్ టికెట్ తీసుకోవాలి. అంతేకాదు..మన దేశం నుంచి వేరే కంట్రీకి వెళ్లాలంటే ఫ్లైట్ టిక్కెట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. పాస్ పోర్ట్, వీసా కూడా తప్పని సరిగా ఉండాలన్నది అందరికీ తెలిసిందే. లేకపోతే నో ఎంట్రీ. అయితే పాస్ పోర్టుతోనే వేరే దేశంలోకి వెళ్లే అనుమతి ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. అక్కడకు వెళ్లాలనుకునేవారికి ఎటువంటి వీసాతోనూ పని ఉండదు. అయితే అటు వంటి శక్తివంతమైన పాస్ పోర్టు కలిగిన దేశాలు ఏవి అన్నది కూడా చాలామందికి తెలియదు. అసలు ఆ జాబితాలో భారతదేశం ఎక్కడ ఉందో కూడా తెలియదు.

భారతదేశంలో ఆధార్ కార్డు ఎంత ఉపయోగపడుతుందో… అలాగే పాస్ పోర్ట్ కూడా వేరే దేశాలకు వెళ్లేవాళ్లకు అది కూడా అత్యవసరం. నిజానికి పాస్ పోర్ట్ అంటే ఎవరు ఏ దేశానికి చెందిన వాళ్లో తెలియజెప్పే గుర్తింపు కార్డు. పాస్ పోర్టు ఆధారంగానే ఎవరైనా సరే ప్రపంచంలోని ఏ మారుమూల దేశానికైనా వెళ్లడానికి అనుమతించబడతారు. అందుకే ప్రతి దేశంలోని పౌరులకు.. వారి వారి దేశాల్లో పాస్ పోర్టు ఉంటుంది. అంతెందుకు దేశం సరిహద్దు దాటి వేరే దేశానికి వెళ్లాలి అంటే.. తప్పనిసరిగా పాస్ పోర్టు చూపించాల్సిందే. పాస్ పోర్టు చూపిస్తేనే ఆ దేశం వీసాను మంజూరు చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే పాస్ పోర్టు మన దేశం నుంచి మనకు వచ్చే గుర్తింపు అయితే.. అదే పాస్ పోర్టు ద్వారా వచ్చే వీసా.. మీరు ప్రపంచంలోని ఏ దేశం వెళ్లాలనుకుంటున్నా ఆ దేశం వారు మీకు ఇచ్చే అనుమతి అన్నమాట. అలా అని అన్ని పాస్ పోర్ట్‌లు ఒక్కటే కాదు. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన పాస్ పోర్ట్ ఉంటుంది. ఆ పాస్ పోర్టులతో కొన్ని పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ కూడా ఉంటాయి.

నిజానికి ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన పాస్ పోర్ట్ ఇండెక్స్ 2023.. పాస్ పోర్టుల లిస్టులలో జపాన్ అగ్రస్థానంలో కొనసాగుతోందట. అంటే జపాన్ పౌరులు.. ప్రపంచవ్యాప్తంగా 193 కంట్రీలకు.. వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ కలిగిన దేశాలకు వారికి నచ్చినట్లు ప్రయాణించవచ్చు. అలాగే సెకండ్ స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు ఉన్నాయట. ఇవి 192 దేశాలకు వీసాఫ్రీ యాక్సిస్‌ను ఆ దేశ పౌరులకు కల్పిస్తున్నాయట. ఇక మూడవ స్థానంలో జర్మనీ, స్పెయిన్ దేశాలు 190 దేశాలకు వీసా ఫ్రీ , వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌తో వీసా స్కోర్‌తో నిలుస్తున్నాయి. నాలుగో స్థానంలో ఫిన్ ల్యాండ్, ఇటలీ, లక్సమ్ బర్గ్ కంట్రీలు 189 వీసా స్కోర్‌తో నిలిచాయి. అలాగే ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్ దేశాలు ఐదో స్థానంలో నిలిచాయి. ఈ దేశాలు 188 వీసా స్కోరును కలిగి ఉన్నాయట. ప్రపంచంలోని ఎక్కువ శక్తివంతమైన పాస్ పోర్ట్ ఇండెక్స్ 2023 లిస్ట్ ప్రకారం.. ఇండియా పాస్ పోర్ట్ 85వ ప్లేసులో ఉంది. ఈ పాసుపోర్టు ద్వారా ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు.. వీసా ఫ్రీ ప్రవేశాన్ని ఇస్తుందని పాస్ పోర్ట్ ఇండెక్స్ తెలిపింది.

అలాగే చెత్త పాస్ పోర్ట్ విషయం లో చూసుకుంటే.. 109 వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ పాస్ పోర్ట్.. 27 వీసా ఫ్రీ స్కోరుతో నిలిచింది. అలాగే 108వ స్థానంలో వీసా ఫ్రీ స్కోరు 29 తో ఇరాక్ నిలిచింది. మరోవైపు వీసా ఫ్రీ స్కోరు 30 తో సిరియా 107వ స్థానంలో నిలబడగా.. 32 వీసా ఫ్రీ స్కోర్‌తో ప్రపంచంలోనే అత్యంత చెత్త పాస్ పోర్ట్ ల జాబితాలో 106 వ స్థానంలో పాకిస్థాన్ నిలబడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 8 =