ట్టిటర్‌లో దూసుకెళుతున్న ప్రధాని మోడీ

PM Modi Crossed 90 Million Followers in Twitter Which is More Than Joe Biden and Rishi Sunak,PM Modi Crossed 90 Million Followers in Twitter,PM Modi Followers is More Than Joe Biden and Rishi Sunak,Modi Followers in Twitter Which is More Than Joe Biden,Joe Biden and Rishi Sunak,Mango News,Mango News Telugu,Prime Minister Modi on Twitter, Modi ,Twitter, Modi is in the top 10 list of most followed Twitter accounts,PM Modis Twitter followers cross 90 million,Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,Narendra Modi,PM Narendra Modi, Narendra modi Latest News and Updates,PM Modi Twitter Followers News Today,PM Modi Twitter Followers Latest News

విశ్వగురువుగా కీర్తించపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు సైతం మోడీకి రెడ్‌ కార్పెట్‌ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఒకప్పుడు మోడీ పర్యటనపై నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా సైతం ఇప్పుడు మోడీ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన మోడీకి అరుదైన గౌరవం లభించింది. రోజురోజుకూ ప్రధాని మోడీ తన ఇమేజ్ పెంచుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మోడీకి ఏటా ఫాలోవర్లు పెరుగుతున్నారు. మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్‌ ఇప్పటికే 90 మిలియన్లు దాటింది. దీంతో ట్విట్టర్ ఖాతాలో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌ 10 జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు.

ప్రపంచంలో చాలా మంది ట్విట్టర్ ఉపయోగిస్తున్నారు. దేశాధినేతలు సైతం ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల ట్విట్టర్ గ్రాఫ్‌ పడిపోతోంది. థ్రెడ్స్‌ వచ్చిన తర్వాత ట్విట్టర్ గట్టిపోటీ ఎదురవుతోంది. అయినా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఇంకా ట్విట్టర్ వేదికగానే తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా, సంపన్న దేశం బ్రిటన్‌ ప్రధానికి కూడా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ట్విట్టర్‌నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఐతే.. వీళ్లు మోడీకన్నా తక్కువ మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు 37.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌కి కేవలం రెండు మిలియన్ల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు.

ప్రస్తుతం ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నవారిలో ట్విట్టర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఈయనకు 148.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 132 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉన్నారు. కెనడియన్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ 112 మిలియన్‌ ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు 108.9 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం 108.2 మిలియన్ల మంది అనుచరులతో బార్బాడియన్‌ గాయని రిహన్నా ఐదవ స్థానంలో ఉన్నారు. అమోరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో 86.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇకపోతే.. నరేంద్రమోడీ 2009లో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు సోషల్‌ మీడియా సైట్‌లో చేరారు. అప్పటి నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌లో ఏటా అయన ఫాలోయింగ్‌ పెరుగుతూనే ఉంది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 90 మిలియన్లకుపైగా ఫాలోవర్లతో.. ట్విట్టర్‌లో అత్యధికంగా అనుసరించే రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు. అలా ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్స్‌ జాబితాలో టాప్‌ 10లో ఉన్న ఏకైక భారతీయుడుగా మోడీ నిలిచారు. ప్రస్తుతం ప్రపంచ జాబితాలో ప్రధాని మోడీ ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 3 =