టోక్యో ఒలింపిక్స్ : సెమీస్‌లో పీవీ సింధు ఓటమి, కాంస్య పతాకానికి మరో అవకాశం

Mango News, PV Sindhu bid for Olympic gold ends in semi-final, PV Sindhu Defeated by Tai Tzu Ying in Semi-Final, PV Sindhu loses against Chinese Taipei’s Tai, PV Sindhu Loses Semi-final to Tai Tzu-Ying, PV Sindhu Loses Semi-final to Tai Tzu-Ying Will Play for Bronze Medal Tomorrow, PV Sindhu loses to Tai Tzu Ying, Tokyo 2020, Tokyo Olympics, Tokyo Olympics 2020, tokyo olympics 2021, Tokyo Olympics 2021 LIVE

టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ సెమీస్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) ఓటమి పాలైంది. శనివారం మధ్యాహ్నం జరిగిన సెమీ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్‌, చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 20-18, 21-12 తేడాతో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్స్ లో అకానె యమగూచిపై 21-13, 22-20 తో సింధు అద్భుత విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. కాగా అంచనాలకు తగ్గట్టుగా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ వస్తున్న పీవీ సింధు సెమీస్ లో ప్రపంచ నెంబర్ వన్‌ తై జు యింగ్‌ సత్తా చాటడంతో నిలవలేకపోయింది. తోలి గేమ్ లో ముందుగా సింధు ఆధిపత్యం సాధించినప్పటికీ, తర్వాత తై జు యింగ్‌ గట్టి పోటీ ఇచ్చి గేమ్ ను సొంతం చేసుకుంది. ఇక రెండవ గేమ్ లో సింధు పోరాడినా, తై జు యింగ్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించి ఫైనల్ కు చేరుకుంది.

కాంస్య పతాకానికి మరో అవకాశం:

ఇక బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ మరో సెమీ ఫైనల్లో చెన్ యు ఫెయ్, హి బింగ్జియావోపై విజయం సాధించి ఫైనల్‌ కు దూసుకెళ్లింది. దీంతో కాంస్య పతకం కోసం పీవీ సింధు, హి బింగ్జియావో మధ్య ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సింధు గెలిస్తే తన ఖాతాలో కాంస్యం పతకం చేర్చుకునే అవకాశం ఉంది. మరోవైపు రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here