జూన్ 17, 18 తేదీల్లో గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi will Visit Gujarat on June 17th and 18th, Narendra Modi will Visit Gujarat on June 17th and 18th, PM Modi will Visit Gujarat on June 17th and 18th, Modi will Visit Gujarat on June 17th and 18th, PM Modi will Visit Gujarat, Gujarat Tour, PM Modi Gujarat Tour, PM Modi Gujarat Tour News, PM Modi Gujarat Tour Latest News, PM Modi Gujarat Tour Latest Updates, PM Modi Gujarat Tour Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 17, 18 తేదీల్లో గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 18వ తేదీ ఉదయం 9:15 గంటలకు పావగఢ్ కొండ వద్ద తిరిగి అభివృద్ధి చేయబడిన శ్రీ కాళికా మాత ఆలయాన్ని ప్రధాని సందర్శించి, ప్రారంభించ‌నున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణం 2 దశల్లో జరగగా, ఇది ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు విరాసత్ వాన్‌ను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు వడోదరలో “గుజరాత్ గౌరవ్ అభియాన్‌” లో ప్రధాని మోదీ పాల్గొంటారు, అక్కడ రూ.21,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో 16,000 కోట్ల రూపాయల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి.

అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో సుమారు రూ.1,800 కోట్ల విలువైన ఇళ్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,530 కోట్లకుపైగా విలువైన ఇళ్లు సహా మొత్తం 1.38 లక్షల ఇళ్లను ప్రధాని అంకితం చేయనున్నారు. వీటికి అదనంగా 310 కోట్ల రూపాయలకు పైగా విలువైన దాదాపు 3000 గృహాల ఖత్ ముహూర్తాన్ని కూడా చేయనున్నారు. మరోవైపు ఈ కార్యక్రమంలో భాగంగా ఖేడా, ఆనంద్, వడోదర, ఛోటా ఉదేపూర్ మరియు పంచమహల్‌ లలో రూ. 680 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించడంలో భాగంగా రూ.800 కోట్లతో చేపడుతున్న ‘ముఖ్యమంత్రి మాతృశక్తి యోజన’ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు ప్రతినెలా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 2 కిలోల శెనగలు, 1 కిలోల కందిపప్పు, 1 కిలో వంటనూనె ఉచితంగా అందజేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here