ఎలోన్ మస్క్ అల్టిమేటం, రాజీనామా బాట పట్టిన వేలాదిమంది ఉద్యోగులు.. అన్ని ట్విట్టర్ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేత

Twitter Shuts All Offices Temporarily After Mass Resignations of Employees Over Elon Musk's Ultimatum Until Nov 21,Elon Musk Ultimatum, Twitter Employees Resigned,Twitter Offices Temporarily Closed,Elon Musk's Ultimatum,Twitter Shuts All Offices Temporarily,Twitter Mass Resignations of Employees,Twitter Employees,Twitter Mass Resignations,Twitter Employees Mass Resignations,Mass Resignations,Twitter,Twitter Latest News And Updates, Twitter News and Live Updates, Elon Musk News And Latest Updates

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కు చెందిన అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. కొత్త బాస్ ఎలోన్ మస్క్ ఉద్యోగులకు జారీ చేసిన అల్టిమేటం సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది ఉద్యోగులు రాజీనామా బాట పడుతున్నారు. దీంతో ట్విట్టర్ సంస్థ కొన్ని రోజులపాటు, ఈనెల 21 (సోమవారం) వరకు తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కాగా ఇటీవలే ఎలోన్ మస్క్ ఉద్యోగులను ఉద్దేశించి.. ‘కంపెనీతో కలిసి ఉండాలంటే ఎక్కువ గంటలు పని చేయండి, లేదా మూడు నెలల విరమణ వేతనంతో నిష్క్రమించండి’ అని చేసిన అల్టిమేటం ఫలితమే ఇదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

అలాగే తను అనుకున్నట్లు ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి అనువుగా, బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీలోని సగం మంది ఉద్యోగులను తొలగించిన మస్క్‌కి ఈ తాజా పరిణామం ఒకరకంగా ఎదురు దెబ్బ వంటిదేనని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే కంపెనీని లాభాల బాట పట్టించాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవని మస్క్ ఆలోచనగా ఉంది. అందుకే ఆయన ఉద్యోగుల నుంచి లిఖితపూర్వక హామీ కోరుతూ ఈ మెయిల్ పంపించారని తెలుస్తోంది. కానీ ఆయన ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా సామూహిక రాజీనామాలు చోటుచేసుకుంటుండటం కంపెనీలో కొంత ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here