ఈనెల 17న పులివెందులలో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి

AP CM YS Jagan Mohan Reddy To Visit Pulivendula on June 17, CM YS Jagan Mohan Reddy To Visit Pulivendula on June 17, YS Jagan Mohan Reddy To Visit Pulivendula on June 17, AP CM YS Jagan To Visit Pulivendula on June 17, AP CM To Visit Pulivendula on June 17, AP CM YS Jagan To Visit Pulivendula, AP CM YS Jagan Pulivendula Tour on June 17, AP CM YS Jagan Pulivendula Tour, Pulivendula Tour, AP CM YS Jagan Pulivendula Tour News, AP CM YS Jagan Pulivendula Tour Latest News, AP CM YS Jagan Pulivendula Tour Latest Updates, AP CM YS Jagan Pulivendula Tour Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఒక వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అలాగే పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గం లోని వైసీపీ పార్టీకి చెందిన కీలక నేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను కడప కలెక్టర్‌ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ వేర్వేరుగా పరిశీలించారు. కలెక్టర్ ఏర్పాటుచేసిన సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మతో పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ నజీర్‌ అహ్మద్, మున్సిపల్‌ కమిషనర్‌, కొత్తపల్లె సర్పంచ్‌ శివచంద్రారెడ్డి, కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు కడప ఎస్పీ అన్బురాజన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ హెలీప్యాడ్‌ నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వరకు నేరుగా రోడ్డు మార్గాన రానున్నందున ఆయా ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు, గెస్ట్‌హౌస్‌లో చేపట్టాల్సిన ఏర్పాట్లుపై పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. ఇంకా బైపాస్‌ రోడ్డు లోని శ్రీదేవి ఫంక్షన్‌ హాల్‌లో వివాహానికి హాజరవనున్న నేపథ్యంలో ఫంక్షన్‌ హాల్‌ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + thirteen =