అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో రష్యా సభ్యత్వం రద్దు, ఓటింగ్‌కు గైర్హాజరైన భారత్

UN General Assembly Suspends Russia From Human Rights Council Amid War on Ukraine, UN General Assembly Suspends Russia From Human Rights Council, UN General Assembly Suspends Russia, UN General Assembly, Human Rights Council, War on Ukraine, UN General Assembly suspends Russia from human rights body over Ukraine abuses, human rights body, UN General Assembly suspends Russia from human rights body, UN General Assembly Suspends Russia From Human Rights Council, United Nations General Assembly, UN General Assembly votes to suspend Russia from human rights body, UNGA, Russia, Ukraine, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌లోని బుచాలో జరిగిన హత్యల తర్వాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నేడు రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేసింది. బుచా మరియు కైవ్ చుట్టుపక్కల ఉన్న ఇతర పట్టణాలలో పౌర హత్యలు జరిపారని రష్యా దళాలపై ఉక్రెయిన్ ఆరోపించింది. బుచా మరియు డజన్ల కొద్దీ ఇతర ఉక్రేనియన్ నగరాలు మరియు గ్రామాలలో రష్యన్ సైనికులు విధ్వంసం సృష్టించారని ఉక్రెయిన్ ప్రతినిధి తెలిపారు. స్థానిక నివాసితులు చంపబడ్డారు, హింసించబడ్డారు, అత్యాచారం చేయబడ్డారు మరియు అపహరించబడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రపంచ దేశాలు మాస్కోపై కొత్త ఆంక్షల కోసం పిలుపునిచ్చాయి.

UN అసెంబ్లీలోని 193 మంది సభ్యులలో, యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదించిన ప్రకారం 93 మంది సస్పెన్షన్‌కు అనుకూలంగా ఓటు వేయగా, 24 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు మరియు 58 మంది గైర్హాజరయ్యారు. కౌన్సిల్ నుంచి ఒక దేశం సస్పెన్షన్‌కు గురికావడం ఇది రెండోసారి, ఇంతకుముందు 2011లో లిబియాపై సస్పెన్షన్‌ విధించారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుండి రష్యాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఉక్రెయిన్ కృతజ్ఞతలు తెలిపింది. మానవ హక్కులను పరిరక్షించే ఐక్యరాజ్యసమితి సంస్థల్లో యుద్ధ నేరగాళ్లకు చోటు లేదని విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక తీర్మానానికి మద్దతునిచ్చిన అన్ని సభ్య దేశాలకు కృతజ్ఞతలు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =