ఉన్నావ్ కేసు నిందితుడు ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్ పై బీజేపీ వేటు

Allahabad high court, BJP Leader Kuldeep Singh Sengar, BJP MLA, Kuldeep, Kuldeep Sengar Suspended, Kuldeep Sengar Suspended From BJP, Kuldeep Sengar Suspended From BJP Over Unnao Rape case, Kuldeep Singh Sengar, Mango News Telugu, MLA Kuldeep Singh Sengar, Raebareli, Raebareli Distric, Raebareli Rape Case, Unnao, Unnao Case Accused Kuldeep Sengar Suspended From BJP, Unnao Rape, Unnao Rape Survivor, Uttar Pradesh

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతున్న ఉన్నావ్ కేసులో కీలక నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్ పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఇప్పటికే ఈ కేసులో కుల్‌దీప్‌ సెంగార్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 18 నెలలుగా అత్యాచార ఆరోపణలు ఎదురుకుంటున్న కుల్‌దీప్‌ సెంగార్ ని బీజేపీ పార్టీ ఇన్నాళ్లు బహిష్కరించక పోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నావ్ బాధితురాలు పై హత్యాయత్నం జరగడంతో ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ పార్టీపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు వేటు వేసింది.

ఇటీవల ఉన్నావ్ బాధితురాలు తన బంధువులతో కలిసి ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్ ఢీకొట్టడంతో, ఇద్దరు బంధువులు చనిపోగా బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో కుల్‌దీప్‌ సెంగార్ పాత్ర ఉందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటన మరోసారి దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది, ఈ కేసుని సీబీఐ విచారణ జరుపుతుంది. ఈ కేసుపైనా సుప్రీం కోర్టులో కూడ పిటిషన్ దాఖలు చేసారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ ఈ ఘటనలో పోలీసులు,అధికారుల నిర్లక్షాన్ని తప్పుపట్టారు, బాధితురాలు కుటుంబసభ్యులు రాసిన లేఖ తన దగ్గరకు ఆలస్యంగా చేరడంపై ఆగ్రహించి, పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. బాధితురాలికి రక్షణగా ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేసిన కూడ, ఇటువంటి ప్రమాదం చోటుచేసుకోవడంతో వారిని సస్పెండ్ చేసారు.

 

[subscribe]
[youtube_video videoid=ZRNJo0FFZpU]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eighteen =